ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఇంకా అలాగే ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.


ఇంకా అలాగే ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేస్ స్టోర్స్ దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్ రీజినల్ యూనిట్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/జూనియర్ స్టోర్ కీపర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంకా అలాగే  ఏపీ హైకోర్టులో టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 29 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఈ పోస్టులకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: