జగన్ పేరు చెబితే చాలు, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ఒంటికాలిపై లేస్తూ విమర్శలు చేస్తుందో, అదే క్రమంలో బిజెపి కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు వెనుకాడటంలేదని, తాము కేంద్ర అధికార పార్టీకి చెందిన వారు అనే భావంతో ఏపీ బీజేపీ నేతలు జగన్ పై తమ ప్రతాపం చూపిస్తూ వస్తున్నారు. ఎలాగూ 2024 నాటికి తెలుగుదేశం పార్టీ మరింత బలహీనం అవుతుందని, ఈ సమయం లోపు వైసీపీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తే, తమ భవిష్యత్తుకు ఢోకా ఉండదు అన్న రీతిలో బిజెపి వ్యవహరిస్తూ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తోంది. ఇక కేంద్ర బీజేపీ పెద్దలు వైసీపీతో మైండ్ గేమ్ ఆడుతూ, సరికొత్త రాజకీయాన్ని చూపిస్తున్నారు. కేంద్ర బిజెపి పెద్దలు జగన్ ను ఆదరిస్తున్నట్టుగా కనిపిస్తున్నా, ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా  వ్యవహరిస్తూ వస్తున్నారు. 

 

IHG

జగన్ కు కేంద్ర బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి అకస్మాత్తుగా దానిని రద్దు చేస్తూ అవమానానికి గురి చేస్తున్నారు. బిజెపి ఎన్ని చేసినా  జగన్ మాత్రం ఎక్కడా సమన్వయం కోల్పోకుండా, బీజేపీపై ఎటువంటి అనవసర వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గానే ఉండి పోతున్నారు. దీనినే బిజెపి అలుసుగా తీసుకుని జగన్ తో ఆటలు ఆడుకుంటోంది. జగన్ ను తాము తలుచుకుంటే ఏదైనా చేయగలను అనే ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. కానీ జగన్ ఆషామాషీ వ్యక్తి అయితే ఏమీ కాదు. అసెంబ్లీలో 151 సీట్లు, పార్లమెంట్ లో 22 సీట్లతో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల లెక్కన చూస్తే, ఆరుగురు ఎంపీలు వైసీపీకి ఉన్నారు. 

IHG's gear to NEXT LEVEL against <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YS JAGAN MOHAN REDDY' target='_blank' title='jagan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jagan</a> ...


భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చూసుకున్నా జగన్ తో బిజెపికి చాలా అవసరం ఉంటుంది. ఈ రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాత బిజెపికి రాజ్యసభలో మిత్రులను కలుపుకుని వెళ్లినా ఇంకా 20 మందికి పైగా సభ్యులు మద్దతు అవసరం అవుతుంది. ఖచ్చితంగా ఆ లోటును తీర్చుకోవడానికి ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి.ఆ లెక్కన చూసుకుంటే  వైసీపీకి రెండేళ్ల తర్వాత అంటే 2022 లో మరో నలుగురు రాజ్యసభ సభ్యులు పెరుగుతారు. వీరిలో ఇద్దరు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్యలో రిటైర్ అయినా, ఖచ్చితంగా మరో ఆరుగురు ఎంపీలు మాత్రం వైసీపీకి వస్తారు. 


అలా చూసుకుంటే 2024 ఎన్నికల నాటికి వైసీపీకి 12 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లు ఎగువ సభలో నెగ్గాలంటే ఖచ్చితంగా జగన్ అవసరం వారికి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో వారు జగన్ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ టిడిపి కి ఒకే ఒక్క రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఉంటారు. అంటే టిడిపి కంటే వైసీపీతోనే వారికి ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ లెక్కన చూసుకున్నా, భవిష్యత్తులో జగన్ ను మచ్చిక చేసుకుని ఆయన కోరిన కోరికలు తీర్చాల్సిన అవసరం బీజేపీకి ఉంటుంది. అందుకే ఏపీ బీజేపీ నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నా, కేంద్ర స్థాయిలో మాత్రం ఎవరు పెద్దగా జగన్ విషయంలో వేలు పెట్టేందుకు ఇష్టపడడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: