ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడులో రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. పోలవరం ప్రాజెక్టు  పనులపై తాజాగా మంత్రి అనీల్ కుమార్ చేసిన ప్రకటనతో చంద్రబాబు గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తున్నట్లే అనుకోవాలి. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పోలవరం ప్రాజెక్టు పనులకు  చాలా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ముందు  బారీ వర్షాలు కురవటంతో సుమారు నెల రోజుల పాటు పనులు ఆగిపోయాయి.  తర్వాత కరోనా వైరస్ పేరుతో దాదాపు ఐదు నెలలు పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత అంచనా వ్యయంపై కేంద్రం వేసిన కొర్రీలు ఇలా చాలా అడ్డంకులే వచ్చాయి. సరే అడ్డంకులు ఎన్ని వచ్చినా ఏదో రూపంలో వాటిని అధిగమించి పనులను పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం. పనులు ఇంత వేగంగా జరుగుతుండటానికి కారణం ఏమిటంటే ప్రభుత్వం నియమించిన మేఘా కాంట్రాక్టు సంస్ధే. ఈ సంస్ధకు సాంకేతిక, ఆర్ధిక దన్ను విపరీతంగా ఉంది. దీని వల్ల పనుల్లో ఒక్కసారిగా జోరు పెరిగిపోయింది. చంద్రబాబు హయాంలో జరిగిన పనులకన్నా  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  పనుల్లో  వేగం పెరిగిపోయిందన్నది వాస్తవం. కాకపోతే జరుగుతున్న పనులను  వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ప్రచారం చేసుకోవటం లేదు.




టీడీపీ హయంలో పనులు చేపట్టిన నవయుగ సంస్ధ ప్లేసులో మేఘా సంస్ధ సీన్ లోకి ఎంటర్ అయిన  తర్వాత ఎర్త్ పనులు, స్పిల్ వే పనులు, స్పిల్ వే ఛానల్ పనులు, గడ్డర్ పనులు, సిమెంట్ వర్కు, ఇనుప గేట్ల అమరిక లాంటి అనేక పనుల్లో ఒక్కసారిగా వేగం పెరిగిపోయింది. ప్రపంచంలో ఎక్కడెక్కడున్న సాంకేతిక పరిజ్ఞానాన్నంతా మేఘా సంస్ధ ఉపయోగిస్తోంది.  పనులు సకాలంలో పూర్తి చేయటంలో ప్రభుత్వానికి కానీ లేకపోతే కాంట్రాక్టు సంస్ధకు కానీ ఎటువంటి అనుమానాలు లేవు. ఇక్కడే సమస్యంతా మొదలైంది. సమస్య ఎక్కడంటే చంద్రబాబులోనే ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోతే తన పరిస్ధితి ఏమిటి ? అనేదే చంద్రబాబు ప్రధాన సమస్య. తన హయాంలో ఐదేళ్ళ కాలాన్ని కేవలం ప్రచారాలు, శంకుస్ధాపనలు, సమీక్షలతోనే చంద్రబాబు గడిపేశారు.పోలవరంలో జరిగిన పనులు తక్కువ చేసుకున్న ప్రచారం చాలా ఎక్కువ అని ఇపుడు బయటపడుతోంది. సోమవారం..పోలవారం అనే పిచ్చి డైలాగులతో కాలమంతా గడిపేశారు.




వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పనులు జోరందుకున్న విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. చెప్పిన గడువులోగా ఎక్కడ పనులు పూర్తయిపోతాయో ? ఉత్తరాంధ్ర, రాయలసీమకు సాగు, తాగు నీరెక్కడ జగన్ ఇచ్చేస్తాడో ? అన్న టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోందట. ఒకసారి పోలవరం ప్రాజెక్టు పనులు గనుక అయిపోతే జగన్ ఇమేజి అమాంతం పెరిగిపోవటం ఖాయం. ఈ విషయాన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఏ ప్రాజెక్టును కూడా చెప్పిన గడువులోగా పూర్తిచేయటం, వినియోగంలోకి తేవటం అన్నది చంద్రబాబు హిస్టరీలోనే లేదు. ఎంత కాలమైన కథలు చెప్పుకుంటూ , ప్రచారం చేసుకుంటు కాలం గడిపేయటమే తెలిసింది.  తాను పనులను చేయలేరు, తర్వాత వచ్చిన వారిని చేయనివ్వరు అనే ప్రచారం చంద్రబాబుపై పెరిగిపోతోంది. ఏదో ఎల్లోమీడియా చేతిలో ఉంది కదా అని జగన్ పై విపరీతంగా బురద చల్లేస్తున్నారు. తాజాగా సీపీఐ కార్యదర్శి  రామకృష్ణ పోలవరం సందర్శన పేరుతో చేసిన డ్రామా అంతా ఇందులో భాగమనే చెప్పాలి.  ఎవరిలో అయినా పనులు జరగకపోతే టెన్షన్ పెరిగిపోవటం సహజం. కానీ చంద్రబాబులో మాత్రం పనులు అయిపోతోందని తెలుసుకుని టెన్షన్ పెరిగిపోతుండటమే విచిత్రంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: