గెలిస్తే అంచ‌నాలు ఉంటాయి
ఓడిపోతే కేవ‌లం అప‌వాదు మాత్ర‌మే ఉంటుంది
కానీ వాటికి అతీతంగా ఉండే జీవితంలో
నిరంత‌రం చేసే పోరుకు ఇలాంటి విజ‌యాలే
ఆలంబ‌న‌లు అవుతాయి.ఆలోచకు కార‌ణం అవుతాయి.

ఆమె గెలుపులో ఎవ‌రి వాటా ఎంత‌?


దేశం అంతా గ‌ర్వించే స్థాయి నీది
మ‌రువ‌కు... ఆ క‌న్నీళ్లేంటి వ‌దిలేయ్
- గోపీ చంద్

నీ గెలుపున‌కు నీ ఓట‌మికీ ఏమీ  
సంబంధం లేకుండా సాధ‌న చేయు
- పార్క్ తే సంగ్
వేర్వేరుగా అనిపించినా ఇద్ద‌రు గురువులు తీర్చిదిద్దాక ఆమె ఈ స్థాయికి  చేరుకున్నారు అన్న‌ది నిజం. ఆమె పోరాటానికి అణు వ‌ణువునా స్ఫూర్తి ఇచ్చిన  ఆ ఇద్ద‌రు గురువుల రుణం ఆమె ఈ జ‌న్మ‌కు తీర్చుకోలేనిది కూడా! కానీ గోపీ స‌ర్ ఫోన్ చేయ‌లేదు.. మెసేజ్ చేశారు అని బాధ‌పడుతూ చెప్పారామె.. సైనా కూడా కాల్ చేయ‌లేదు. అంటే ఈ  దేశం ఆమె విజ‌యం చూసి పూర్తిగా గ‌ర్విస్తుంద‌ని అనుకోవాలా లేదా?
 

వివాదాల‌కు దూరంగా ఉంటే సింధూకు ఇష్టం. కొన్ని కార‌ణాల రీత్యా ఆమె గోపీచంద్ అకాడ‌మీ నుంచి వ‌చ్చినా కొరియ‌న్ కోచ్ ద‌గ్గ‌రే మ‌రింత శిక్ష‌ణ పొంది, త‌న త‌ప్పులు తెలుసుకుంది. దిద్దుకుంది.. త‌న‌తో మ‌రికొంద‌రు బిడ్డ‌లు ఆడేవారంట! వారి గురించి చెప్పి ఆనంద‌ప‌డిపోయింది సింధు.. సుచిత్రా అకాడ‌మీ క్రీడాకారులు రోజూ వ‌చ్చి త‌న‌తో సాధ‌న చేసేవార‌ని చెప్పారామె.. ఈ విజ‌యంలో  ఎవ‌రి వాటా ఎంతంటే ఏం చెబుతాం..


రియోలో నేనెవ్వ‌రో తెలియ‌దు..కానీ ఇప్పుడు చాలా అంచ‌నాలు ఉన్నాయి. నా త‌ప్పులు ఈ సారి స‌రిదిద్దింది కొత్త కోచ్ పార్క్ నే అన్నారు. గ‌తంలో కంటే మెరుగ‌వ్వ‌డం ఓ సాధ‌కురాలి ల‌క్ష‌ణం. గ‌తం స్మ‌రిస్తూ త‌న‌ని తాను దిద్దుకోవ‌డం ఓ సాధ‌కురాలి క‌ర్తవ్యం.ఈ రెండూ ఆమె జీవితాన్ని న‌డిపేయి. అవునండి ఆ రోజు నాపై అంచ‌నాలు లేవు ఇప్పుడు నాపై న‌మ్మ‌కం విశ్వాసం ఈ దేశం చూపించే ప్రేమ అన్నీ  రెట్టింపు అయ్యాయి..అందుకే ఈ గెలుపు ఈ దేశానికి, క‌రోనాతో స‌త‌మ‌తం  అయిన కుటుంబాల‌కూ అంకితం ఇస్తున్నాను అని  చెప్పారు..



మరింత సమాచారం తెలుసుకోండి: