తెలంగాణలో  రియల్‌ ఎస్టేట్‌ రంగం ఓ రేంజ్‌లో దూసుకుపోతోందట. ఈ విషయం ఇటీవల తెలంగాణ సర్కారు పన్ను వసూళ్ల లెక్కలు బయటపెట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు భారీగా పెరిగాయని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల అమ్మకాలు తెలంగాణ రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయట. ఈ జోరు ఎంతగా ఉందంటే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయలకుపైగా విలువైన రియల్‌ ఎస్టేట్‌ క్రయవిక్రయాలు నమోదయ్యాయట.


ఈ లెక్కలు చూస్తే.. గత ఆరేళ్లలో ఈ రియల్‌ ఎస్టేట్‌ క్రయవిక్రయాలు దాదాపు డబుల్ అయ్యాయట. ఈ లెక్కలు చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌  లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు యమా జోరుగా సాగుతున్నాయట. పాత లెక్కలు తిరగేసి..  గత ఆర్థిక సంవత్సరంలో 7.46 లక్షల ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల క్రయవిక్రయాలు జరిగాయట. ఈ లావాదేవీల విలువ సుమారు లక్ష కోట్లుగా తేలిందట. అలాగే ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి 7 వేల 560 కోట్ల ఆదాయం వచ్చిందట.


అంతే కాదు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువ కంటే 45 శాతం ఎక్కువ మొత్తానికి రిజిస్ట్రేషన్లు జరిగాయట. ఇళ్ల స్థలాలకు సంబంధించి.. ప్రభుత్వం నిర్ణయించిన విలువకు, వాస్తవ విలువకు చాలా తేడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన అనధికారికంగా ఈ లావాదేవీల విలువ చాలా భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆరేళ్లలో వ్యవసాయేతర ఆస్తుల క్రయవిక్రయాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. అంటే తెలంగాణ ప్రభుత్వ రాబడి మూడింతలు పెరగిందన్నమాట.


2020-21 ఏడాదిలో కరోనా ప్రభావం వల్ల రిజిస్ట్రేషన్లు మందగించాయి. కానీ ఆ తర్వాత ఏడాది రికార్డుస్థాయిలోనే  రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరిగాయట. క్రయవిక్రయాల్లో  ఎక్కువగా ఇళ్ల స్థలాలు అత్యధికంగా ఉన్నాయని.. ఆ తర్వాతి స్థానాల్లో ఇళ్లు, ఫ్లాట్లు ఉన్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి 9 వేల 237 కోట్ల రాబడి వచ్చిందట.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr