చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆ దేశ సైనికులతో వీడియో కాన్ఫరెన్స్ లో యుద్దానికి సన్నద్ధంగా ఉండాలని మాట్లాడిన వీడియో బయటకు రావడంతో విషయం అందరికి తెలిసింది. ముఖ్యంగా ఇండో చైనా బార్డర్ లో ఉన్న సైనికులను ఉద్దేశించి జిన్ పింగ్ ప్రసంగించారు. దీనితో భారత్ కూడా తామేమీ తక్కువ తినలేం అన్నట్టు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, తూర్పు లడక్ ప్రాంతాల్లో వాయుసేన యుద్దానికి సిద్ధం అంటూ హెచ్చరికలు పంపిస్తుంది. భారత్ చైనా సరిహద్దులో ఇండియా భారీ విన్యాసాలకు సిద్ధమైంది.


తూర్పు సెక్టార్ లో నీ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలలో భారీ విన్యాసాలకు భారత ఆర్మీ వాయుసేన సిద్ధమైంది లడక్ సరిహద్దుల్లో యుద్ధసన్నద్ధతని  జిన్ పింగ్ పరిశీలించిన పిదప భారత్ ఈ చర్యలకు పూనుకుంది. ప్రళయ పేరుతో ఈ విన్యాసాలకు భారత వాయుసేన సిద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.  అంతేకాదు జాతీయ మీడియా సైతం ఈ వార్తలని ఎక్కువగా ప్రచారం చేస్తుంది. అసిమారా తేజ్పూర్ లాంటి ఎయిర్ బేస్ ల నుంచి ఈ విన్యాసాలు చేయడానికి భారత వాయు సేన సిద్ధంగా ఉన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.


రాఫెల్‌, సుకోయ్ 30, పైటర్ జెట్స్ లాంటి యుద్ధ విమానాల తో విన్యాసాలు చేయనున్నట్లు సమాచారం. తూర్పు సెక్టర్ లో చేపడుతున్నటువంటి రెండో భారీ విన్యాసాలు ఇవి అని చెప్పవచ్చు.  గతంలో తవాంగ్ సరిహద్దుల్లో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన గొడవలో భారత సైనికులు 20 మంది చనిపోయిన విషయం విదితమే. ఆ సమయంలో మొదటిసారి తూర్పు సెక్టర్ లో  భారత్ భారీ విన్యాసాలు చేపట్టింది.


యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు చెప్పడంతో భారత్ కూడా తామేమి తక్కువ కాదని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పడానికి విన్యాసాలు చేపడుతుంది. ముఖ్యంగా చైనా బెదిరింపులకు తామేమి భయపడం అని భారత సైన్యం మరో మారు స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: