ఐటిఐఆర్‌ ప్రాజెక్ట్ పై బిఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రం, భాజపా, నరేంద్ర మోదీ పై ఆరోపణలు చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు. ఐటి ఐ ఆర్ ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో అసెంబ్లీ బయట మాటల దాడులు చేస్తున్నారని..
ఐటీఐఆర్ ప్రాజెక్టు అంటే ఒక భవనం కాదని.. 2008 లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ITIR ప్రాజెక్టు ఆలోచన చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.


భాజపా కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో అభివృద్ధి చేయాలని 2010లో నిర్ణయించిందని..20ఏళ్ల లో పూర్తి అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని.. 2010లో హైదరాబాద్ లో 202 చదరపు కిలోమీటర్లలో ITIR ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు. ఇందుకు 4,863 కోట్ల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని.. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం 3,275 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటున్నారు.


రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎన్ని పనులు చేసిందో చెప్పాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ITIR పై బహిరంగ చర్చకు సిద్దంగా లేకపోయినా స్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫలక్ నామ నుంచి ఉందానగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వం 2015లోనే 85 కోట్ల రూపాయలు కేటాయించిందని.. ఈ పనులు ఎందుకు పూర్తి కాలేదని.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.


పాతబస్తీకి మెట్రో రాకపోవడానికి  తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఎంఐఎం బాధ్యత వహించాలని.. ఇప్పటి వరకు పనులే చేయలేదని.. ఐటిఐఆర్‌ ఫస్ట్ పేజ్ పనులే పూర్తి చేయలేదని.. ఇక సెకండ్ పేజ్ ఎలా చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారని.. కానీ.. కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటున్నారు. ITIR కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తొలివిడత నిధులు విడుదల చేసిందన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు..  సిటీలో ఎలక్ట్రానిక్స్ తో సంబంధం లేని అమెజాన్ కు స్థలం కేటాయించారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: