
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అలాంటి వ్యక్తిత్వం భారత పౌరుల్లో పోవడం లేదు. పక్కన ఉన్న వాడు ఏదీ చెప్పినా గుడ్డిగా నమ్మి మోసపోవడం మన వంతవుతోంది. అదానీ కంపెనీకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రూ. 6,183 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2022 డిసెంబర్ 31 నాటికి రూ. 6347 కోట్లుగా ఉన్నాయని ప్రకటించారు. అయితే ఏయే అదానీ కంపెనీలకు ఎన్ని కోట్ల రుణాలు ఇచ్చారో అన్నింటిని పూస గుచ్చినట్లు చెప్పారు.
ఇవేవీ తెలియని కొందరు అదానీ సంస్థలకు ఎల్ ఐసీలో ఉన్న రుణాలను అన్నింటిని ఇచ్చేశారని పుకార్లు చేస్తున్నారు. అయితే మిగతా 5 బీమా కంపెనీలు అదానీ కంపెనీలకు రుణాలు ఇవ్వలేదని కూడా చెప్పారు. కానీ ఒక్క సారి హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ప్రపంచ కుబేరుల స్థానాల్లో ఆయన దిగజారిపోయారు. ఇక్కడ దేశం నుంచే చేస్తే ఇబ్బంది అవుతుందనుకున్న కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలు అదానీ గ్రూపులను ఎలాగైనా దెబ్బకొట్టాలని హిండెన్ బర్గ్ నివేదికను బయటకు తీసుకొచ్చింది.
దీనివల్ల భారత్ లో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ప్రచారం చేయాలనుకున్నారు. కానీ పండమెంటల్ గా భారత్ ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది. ఎవరూ అంత తేలిగ్గా దీన్ని నాశనం చేయలేరు.