కెసిఆర్ తరహా వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నారని తెలుస్తుంది. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే ఎలక్షన్లలో డబ్బులు ఇస్తున్నారని, చంద్రబాబు బేరం పెట్టారని చంద్రబాబు పై నిఘా పెట్టడం గాని, ఆ రోజు ఆయన మాటలను రికార్డు చేయడం గాని, రేవంత్ రెడ్డి వచ్చేలా ప్లాన్ చేయడం గాని, డబ్బులు తీసుకోవడం గానీ, వీడియో, ఆడియోతో సహా పట్టుకోవడంలో గానీ, ఆన్ ది స్పాట్ అరెస్టు చేయడం గాని ఇదంతా కేసిఆర్ వ్యూహం.


ఆ దెబ్బకి చంద్రబాబు నాయుడు బిత్తర పోవాల్సి వచ్చింది. అప్పుడు దానిపై గంభీరమైన ప్రకటనలు అయితే చేశారు గాని ప్రజలు వాటిని హర్షించలేదు. నాకు సిఐడి, ఏసీబీ ఉన్నాయి, నీకు సిఐడి, ఏసీబీ ఉన్నాయి అంటూ ఉంటే ఆంధ్ర, తెలంగాణలో జనం నవ్వుకున్నారు కూడా. అది కుట్ర అంటే ఎవరు నమ్మలేదు. ఎందుకంటే క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి. అదే దెబ్బతో మొదలయి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమై కనుమరుగైపోయే పరిస్థితిలో, మొన్న 2సీట్లకు పరిమితమైన పరిస్థితి. ఇప్పుడు పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు.


ప్రతిపక్షంలో ఉండి కూడా వైసీపీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలను తెచ్చుకోగలిగారు. అయితే వాళ్ళని కొన్నారు అని అంటే మేము అమ్ముడుపోలేదు అంటున్నారు వాళ్ళు. నలుగురు అయితే ఓట్లు వేశారు వీటికి. కాటం రెడ్డి, ఆనం లకు టికెట్స్ ఖరారు కాబట్టి వాళ్ళు ఓట్లేసి ఉండవచ్చు. మిగతా ఇద్దరు వచ్చేటప్పటికి అటు శ్రీదేవికి, ఇటు మేక పాటికి ఇద్దరికీ టికెట్స్ ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఓటు వేయడానికి ఏదో ప్రలోభమే ఉంటుంది.


మొన్న  రాపాక మాట్లాడటం, తాజాగా మద్దాలగిరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచి వైసిపి అటాచ్డ్ సభ్యుడిగా కొనసాగుతున్నాడో, తన ఫోన్లు చేసి బేరం ట్రై చేశారని, ఫోన్ కూడా ఎత్తలేదు అని చెప్పాడు. దీంతో ఓటుకు కోట్లు అనేటువంటి అంశం మళ్ళీ తెరపైకి వచ్చిందా అన్నది కొంతమంది సందేహం అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: