
ఎన్ కౌంటర్ చేయడం అంటే ఒకరిని చంపడం కాబట్టి అది తప్పే. కానీ న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని ఎప్పుడు రక్షిస్తూ ఉండే పోలీసు ఇంకా న్యాయ వ్యవస్థని కూడా భయపడుతూ ఉండే అసాంఘిక శక్తుల్ని కనుక తీసేయకపోతే సమాజం అత్యంత ప్రమాదకరమైన దశకు వెళ్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్ అలాంటి వాళ్ళను ప్రోత్సహించడం వల్లనే అసాంఘిక శక్తులు ఊళ్ళని ఏలుతున్నాయని, జనం అల్లాడిపోతున్నారని వాళ్ళు అంటున్నారు.
మన దగ్గర ఫ్యాక్షనిస్టులు, రౌడీలు లాంటి వాళ్ళు సమాజానికి వాళ్ళు చేసేదేమీ లేకపోగా సమాజం ఎదుగుదలకు వాళ్ళు ప్రతిబంధకంగా నిలబడతారు. కానీ అక్కడ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నది నరమేధం అని మానవ హక్కుల వాళ్ళు అంటుంటే, ప్రజలు మాత్రం అక్కడ జరుగుతున్నది ధర్మ యుద్ధమని అంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ అలాంటి వాళ్ళందరికీ షెల్టర్ ఇస్తుంది. ఆ పార్టీకి మైనార్టీ ఓట్ల అన్నింటిని ఆ వ్యక్తులు తీసుకొచ్చి ఇచ్చారు. అందుకనే గతంలో 130వరకు గెలిచింది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇట్లాంటి వాటి మీద విచారణకు యోగిని అరెస్టు చేస్తుందని గ్రౌండ్ లెవల్లో సందేశం పంపిస్తుంది. తద్వారా మత నాయకులుగా చూపించేటటు వంటి వాళ్ళని, ఆ మతస్థులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. బాబ్రీ ఇన్సిడెంట్ తర్వాత దేశవ్యాప్తంగా మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ కోల్పోయింది. ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ ఓట్లను కొట్టుకుపోయాయి. ఇప్పుడు వాటిని రాబట్టుకోవడానికి యోగి ఆదిత్య నాధ్ ని ఏదో ఒకటి చేయాలని కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్ లో ప్రచారం ప్రారంభించిందని, ఇది ప్రమాదకరమైన సంకేతం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.