
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఇచ్చిన కేసుల్లో కానీ, కోర్టులు చెప్పిన కేసుల్లో కీలకమైన దర్యాప్తును సీబీఐ చేపడుతుంది. 2018 తర్వాత సీబీఐని ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నిషేధించారు. కేంద్రంపై అనుక్షణం నిప్పులు చెరుగుతూ బీజేపీని నిందిస్తూ ప్రజల్లో మళ్లీ వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయనగా నాటకం మొదలు పెట్టారని ప్రతిపక్షాలు చంద్రబాబు తీరును ఎండగట్టాయి. ఇదే సమయంలో వైసీపీ నాయకులు కూడా ఈ అంశాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకుని ముందుకు సాగారు.
తమ దాకా వచ్చే సరికి టీడీపీ సీబీఐపై నిషేధం విధించిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఒకప్పుడు లోకాయుక్తకు ఎక్కువ పవర్స్ ఇచ్చింది యడుయూరప్ప. కానీ ఆ లోకాయుక్త ద్వారానే యడుయూరప్ప అరెస్టు అయ్యారు. బీజేపీ కన్నడ నాట అధికారంలోకి వచ్చాక లోకాయుక్తకు అవకాశం ఇస్తే తన అధికారాన్ని పోగొట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ విచారణకు ఒప్పుకున్నాక ముమ్మర దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.
ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ సీబీఐని రాష్ట్రంలో విచారించేందకు అనుమతించడం వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, ఆయన కుటుంబంపై ఆరోపణలు రావడంతో ఆత్మరక్షణలో పడిపోయినట్లు తెలుస్తోంది. అనవసరంగా చంద్రబాబు నిషేధం విధించిన సీబీఐపై మనం దర్యాప్తు చేసుకోవచ్చని అనుమతి ఇవ్వడం పొరపాటు ఎమైనా జరిగిందా అని జగన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.