ఇప్పుడు సాధారణంగా రవాణా సౌకర్యాల కోసం, ప్రయాణాల కోసం మనం అందరం పెట్రోల్, డీజిల్ ఇంధనాలతో నడిచే వాహనాలనే వాడుతుంటాం. అయితే ఈ పెట్రోల్, డీజిల్ వాహనల వల్ల కాలుష్యం అనేది ప్రపంచమంతా విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంతే కాకుండా ఈ పెట్రోల్, డీజిల్ ఇంధనాల కోసం అయ్యే ఖర్చు కూడా  ప్రపంచ దేశాలకు పెను భారం అవుతూ వస్తుంది.


అంతే కాకుండా పెట్రోల్, డీజిల్ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉండడంతో దానిని వాడే మధ్య తరగతి వర్గాల నుండి అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ కాలుష్య నియంత్రణ కోసం ఒక కొత్త ఆచరణను తీసుకురాబోతుందని తెలుస్తుంది. ప్రత్యేకించి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ను తీసుకు రాబోతుంది కేంద్ర ప్రభుత్వం.


అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం ద్వారా పెట్రోల్, డీజిల్ ఖర్చు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలను రంగంలోకి తీసుకురావడానికి నడుం కట్టింది. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు 10వేల ఎలక్ట్రిక్ బస్సులను అందించనుందని తెలుస్తుంది. అయితే దీనికోసం కేంద్రం 54వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించింది అని తెలుస్తుంది. అయితే ఈ 54వేల కోట్ల బడ్జెట్లో 20,000కోట్లు కేంద్రం ఇస్తుందట.


మిగిలిన 34,000 కోట్ల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలని అంటున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులు అనే కొత్త ప్రతిపాదనను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొస్తున్నట్లుగా ముందు నుండి వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఇందులో నిజం లేదని ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అని తెలుస్తుంది. కానీ మొత్తానికి ఎవరు తీసుకొచ్చినా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో చార్జింగ్ పాయింట్లు ఉండడం లేదు కాబట్టి వాటిని జనాలు ఎంకరేజ్ చేయలేదు ఇప్పటివరకు. కానీ ఇప్పుడు కేంద్రమే ముందుకు వచ్చింది కాబట్టి వీటిని ఏర్పాటు చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: