నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటకుండా చూడాల్సింది ప్రభుత్వమే. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల వారు ఈ ధరల పెరుగుదల వల్ల  బాధలు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అప్పటికి చాలీచాలని జీతాలతో జీవితాలు గడిపే పేద, మధ్య తరగతి వాళ్లకు ఈ అధిక ధరలుతో మూలిగే నక్క పైన తాటికాయ పడినట్లు అయిపోతుంది. అయితే వీళ్ళ బాధలు ఇలా ఉంటే ప్రతి చిన్న దానికి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకునే వాళ్ళ  లెక్క మాత్రం వేరేగా ఉంటుంది.


వాళ్లు ప్రభుత్వం ఏం చేసినా కూడా తప్పే అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు.  ఉదాహరణకి  నిత్యవసర వస్తువు అయిన ఉల్లిపాయలు లేదా టమాటాలు లేదా మరి ఏదైనా వస్తువు ధరలు పెరిగాయంటే   వీళ్ళ చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయిపోతుంది. ప్రజలు పెరిగిన ధరలతో  ఆ ఉల్లిపాయలో లేదా టమాటాలో లేదా మరి ఏదైనా వస్తువో కొనలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు పక్క దేశాలకు ఎగుమతులు చేయడం అవసరమా అని మొదలు పెడతారు వీళ్ళు.


అంతేకాకుండా ఒకవేళ అవే నిత్యవసర వస్తువుల ధరలు గనుక తగ్గితే ఆ ఉల్లిపాయల రైతులకో లేదా టమాటా రైతులకో ప్రభుత్వం సరైన గిరాకీ ధర కూడా అందివ్వడం లేదని మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఉల్లికి సంబంధించిన ఎగుమతులపై నిషేధం విధించడానికి చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ డైరెక్ట్ గా నిషేధం విధించకుండా ఆ ఎగుమతుల పై పన్నులు పెంచే ఆలోచన చేస్తుంది.


అయితే దీనిపై  రైతులు ఆందోళన చేస్తున్నారని ప్రాజెక్ట్ చేసుకొస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రైతులు ఉల్లిపాయలను డిస్ట్రిబ్యూట్ చేయరు.  దీనికంటూ కొంతమంది బ్రోకర్లు ఉంటారు. ఈ ఉల్లిపాయల విషయానికి వచ్చేసరికి హైయెస్ట్ ఆనియన్ బ్రోకర్ శరద్ పవార్ అని తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు బ్రోకర్ల దందాని కూడా రైతుల ఆగ్రహావేశాలుగా చూపించుకుంటూ వస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: