
కొండల్లో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ కు ముందు ఇద్దరు ఆర్మీ అధికారులు.. ఒక పోలీసు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో కల్నల్ మన్ ప్రీత్ సింగ్.. మేజర్ అశిత్ దోనల్ తో పాటు తీవ్రంగా గాయపడ్డ కశ్మీర్ పోలీసు హుమాయున్ బట్ తీవ్రవాదులతో పోరాటంలో కన్ను మూశారు. దీంతో ఇండియన్ ఆర్మీ ఎలాగైన సరే ఉగ్రవాదులను తుద ముట్టించాలని నిర్ణయం తీసుకుంది.
అనంత్ నాగ్ జిల్లా కాకల్ కోట్ లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల నక్కి ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో వెళ్లిన ఆర్మీ అధికారులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. కొండ ప్రాంతాల్లో ఉండటం అక్కడికి వెళ్లడానికి చాలా శ్రమించాల్సి రావడంతో ముందుగా అనుకున్నంత ఈజీగా పని కాలేదు. దీంతో ఆర్మీ డ్రోన్లు.. అత్యంత అధునాతన యుద్ధ విమానాలతో ఉగ్రవాదులు దాక్కున్న స్థావరాలను గుర్తించింది.
తర్వాత వేట కొనసాగించిన సైన్యం ఉగ్రవాదుల స్థావరాలను చేరుకునేందుకు ఒక్కో ప్లాన్ వేస్తూ చివరకు వారు ఉన్న స్థావరాలను చేరుకుంది. అక్కడ ఉగ్రవాదులకు సైన్యానికి భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఉగ్రవాదులు కొన్ని సార్లు ఫైరింగ్ ఆపేయడం.. మరి కొన్ని సార్లు ఫైర్ చేయడంతో ఈ ఎన్ కౌంటర్ చాలా కష్టంగా సాగినట్లు తెలుస్తోంది.