
కాబట్టి టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని చెబుతున్నారు. అయితే టికెట్ల రేట్లు పెంచిన విషయాన్ని తెలుసుకున్న కర్ణాటక ఆర్టీసీ దీన్ని క్యాష్ చేసుకుంటుంది. చిత్తూరు జిల్లాకు కర్ణాటక బస్సులు ఎక్కువగా నడిపిస్తుంటారు. అదే సమయంలో కర్ణాటక బస్సుల్లో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు ఎక్కువగా కెఎస్ ఆర్టీసీకి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటక, తమిళనాడు కు ఎక్కువగా బస్సు ప్రయాణాలు సాగుతుంటాయి. అయితే కళ్ల ముందే కర్ణాటక ఆర్టీసీ వారు ఎక్కువ సర్వీసులు పెంచి తక్కువ ధర టికెట్లతో ఆదాయం పొందుతున్నారు. కానీ ఏపీ ఆర్టీసీ మాత్రం ఇంత జరుగుతున్నా కూడా ఎలాంటి స్పందన లేదు. పెంచిన టికెట్ల తగ్గించేందుకు ఎలాంటి ఆలోచన చేయడం లేదు. ఇలాంటి పరిణామాలు జరిగితే ఏపీ ఆర్టీసీ మరింత నష్ట పోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇలానే టికెట్ రేట్లు ఇష్టారీతిన పెంచుకుంటూ పోతే చివరకు ఏపీ ఆర్టీసీ రాబోయే రోజుల్లో ప్రయాణికులు లేక వెల వెల బోయే అవకాశం ఉంది. ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మరింత ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలి. కానీ ప్రభుత్వ రంగ సంస్థగా మారిన తర్వాత ప్రయాణికులకు కావాల్సిన మరిన్ని సౌకర్యాలు చేపట్టి... ఆర్టీసీ బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా ఏపీ ఆర్టీసీ పెంచిన రేట్లు.. కర్ణాటక ఆర్టీసీకి కలిసొచ్చింది.