
ఆ సమయంలో చంద్రబాబుకు ఎన్ని ముడుపులు ముట్టాయో చెప్పలేదు. చంద్రబాబు సీఎంగా ఉండి ఏదైనా ప్రాజెక్టు ఆంధ్రకు వస్తే దాన్ని హైలైట్ చేసి చూపించడంలో ఎల్లో మీడియా రోత కథనాలు ప్రచురిస్తుంది. ఎంతో మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రపంచ స్థాయి కంపెనీని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొడతారు. కానీ జగన్ సర్కారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తోంది.
అయితే పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమలు రాకపోతే మాత్రం జగన్ కు చేతకావడం లేదు. ఇప్పటి వరకు ఏమేం పరిశ్రమలు తెచ్చారు. అంటూ తెగ విమర్శలు చేస్తూ ఉంటారు. పరిశ్రమలు తీసుకురావడానికి వ్యాపార, వాణిజ్య వేత్తలు వస్తుంటే జగన్ కు ముడుపులు అందుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి జరగాలి.. కానీ అది బాబు చేస్తేనే అభివృద్ధి అవుతుంది. ఇక్కడ సంక్షేమం జరగాలి.. బాబు హాయాంలో చేస్తేనే అది సంక్షేమం అని ప్రచారం చేస్తూ జనాలను పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నారు.
అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి అంశం ప్రజల ముందు కనిపిస్తుంది. ఎవరూ అనుకూలంగా వార్తలు రాస్తున్నారు. ఎవరూ రాయడం లేదు. ఎందుకు రాస్తున్నారు. గతంలో ఏం జరిగింది. ఇలా అన్ని రకాల విషయాలు తెలుసుకుంటున్నారు. సీపీఎం నేత రామకృష్ణ మాట్లాడుతూ.. 1400 కోట్లు జగన్ ముడుపులు అందాయి కాబట్టే ఇలా అదానీ కంపెనీలకు ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి రాతలను జనం అర్థం చేసుకునే రోజులు వచ్చాయి.