
ప్రస్తుతం మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 8 మిలియన్ డాలర్లు మాత్రమే. విదేశీ ఉపగ్రహాలను ముఖ్యంగా యూరోపియన్ దేశాలవి ప్రయోగించడం వల్ల దాదాపు 200 మిలియన్ యూరోలు సంపాదన వస్తుందని తెలుస్తుంది. అమెరికా దేశానికి చెందిన ఉప గ్రహాల ప్రయోగం ద్వారా మరో 180 మిలియన్ డాలర్ల వరకు ఆర్జించారని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇండియాలో అంతరిక్ష విభాగంలోో సంపద పెరగడానికి కారణం విదేశీయులు చేసే ప్రయోగాలు చాలా కాస్ట్ తో కూడుకున్నవి.
అదే ప్రయోగాలను ఇస్రో చాలా తక్కువ ఖర్చుతో చేసి చూపిస్తుంది. దీంతో యూరప్ దేశాలు, చివరకు అమెరికా సైతం భారత్ ద్వారా ఉప గ్రహాలను పంపించుకుని ముందుకు సాగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ప్రపంచంలో నే అత్యంత విలువైన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒకానొక సమయంలో దేశంలో నే ఉండే కొన్ని సంస్థలు, కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం తీవ్ర విమర్శలు చేశారు.
తినడానికి తిండి కూడా లేకున్నా అంతరిక్ష ప్రయోగాలు అవసరమా అని కమ్యూనిస్టు పార్టీలు విమర్శించి ప్రజల్లోకి తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. అంతటి విమర్శల నుంచి భారత అంతరిక్షవ్యవస్థ ఔరా అనే విధంగా చంద్రయాన్ 3 ను సక్సెస్ చేసి విమర్శకుల నోళ్లు మూయించింది. ముఖ్యంగా విదేశీయులు చేసే ఖర్చు కంటే చాలా తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను పంపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.