అక్కడ ఉన్న స్థానిక టీడీపీ నేతలను చంద్రబాబు బుజ్జగించారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ రెడ్డికి ఆత్మకూరు సీటు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే సీటు ఆనంకు ఖాయమైనప్పటికీ పోటీ చేసే స్థానం గురించి కాస్త డైలామా నెలకొంది. ఆనం సర్వేపల్లిలో పోటీ చేస్తే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీ అయ్యే అవకాశం ఉంది.
ఆనం ఒక వేళ ఆత్మకూరులో పోటీ చేస్తే సోమిరెడ్డి సర్వేపల్లిలో పోటీ చేసే అవకాశం ఉంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ లకు సిట్టింగ్ స్థానాలు కొంచెం అనుకూలించేలా లేవు. ఇలాంటి విషయాలను ఎల్లో మీడియాలో ప్రచురించారు. చంద్రబాబు సిట్టింగ్ లకు ఇవ్వకపోయినా తప్పులేదు. కానీ జగన్ అదే విషయాన్ని చేస్తే దాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపించడంలో వారిని మించిన వారు లేరు.
అందుకే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం అయ్యాక అసలైన ప్రతిపక్షం టీడీపీ కాదు.. ఎల్లో మీడియా పత్రికలే అని అన్నారు. ఇలా అనడానికి బలమైన కారణం ఉండబట్టే జగన్ అన్నారని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సిట్టింగ్ ల మార్పు ఏటు వైపు దారి తీస్తుందో ఎవరికి మేలు చేస్తుందో ఎవరిని ఇంటి దారి పట్టిస్తుందో.. ఎవరిని అసెంబ్లీలో కూర్చొబెడుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి