టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ముందుగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఎందుకంటే ఈయనంత త్యాగ శీలి మరొకరు చంద్రబాబు కి దొరకరు అంటే అతిశయోక్తి కాదేమో. ముందు ముప్పావు సీట్లు అన్నారు. ఆ తర్వాత 40, 30, 25 ఇలా చివరకు 24 దగ్గర ఆపేశారు. ఈ క్రమంలో వీటిని సమర్థించుకునే క్రమంలో గాయత్రి మంత్రంలో అక్షరాలు 24 అని, అశోక చక్రంలో ఆకులు 24 అని.. ఇలా రకరకాల కథలు అల్లారు. జనసైనికుల్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సలహాలు ఇచ్చే వారిని సైతం తిట్టేశారు.



పోనీ ఆ 24 కు ఏమైనా ఫిక్స్ అయ్యారా అంటే అదీ లేదు. కూటమితో బీజేపీ కలిశాక ఈ సీట్ల సంఖ్య 21 కి చేరింది. ఈ సందర్భంలో తనకు ఓ వ్యూహం ఉందని ప్రకటించేశారు. కనీసం 21 స్థానాల్లో అయినా నికరంగా గెలుద్దామంటూ కార్యకర్తలకు ఉద్భోద చేశారు. ఈ సీట్లు ఏమైనా పవన్ అడిగి డిమాండ్ చేసి తీసుకున్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు ఏయే స్థానాలు ఇస్తే వాటినే తీసుకున్నారు. గుంటూరు-2,  సత్తెన పల్లి, తన సెంటిమెంట్ స్థానం రాజమండ్రి రూరల్ సీట్లను సిట్టింగ్ అనే పేరుతో వదులుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా రఘురామ కృష్ణ రాజు ఎంట్రీతో అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.


ఆయనకు ఉండి సీటు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇది టీడీపీ సిట్టింగ్ సీటు. పవన్ అడిగితే చంద్రబాబు తన సిట్టింగ్ సీట్లను వదులుకోరు. రఘురామ కోసం అయితే అభ్యర్థిని ప్రకటించి మరీ మార్చేస్తారు. పవన్ కన్నా కూడా రఘురామ త్యాగం పెద్దదా.  చంద్రబాబు కోసం సీట్లతో పాటు జన సేన ఇన్ ఛార్జిలను సైతం వదులుకునేందుకు పవన్ సిద్ధమయ్యారు. ఇప్పుడు మరికొన్ని సీట్లు మారుస్తామని చంద్రబాబు అంటున్నారు. ఇప్పుడు అయినా పవన్ తనకు కావాల్సినవి అడిగి తీసుకుంటారా లేక చంద్రబాబుకి త్యాగశీలి అనే పదానికి సార్థకత చేసుకుంటారా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: