ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు. కడప లోక్ సభ పరిధిలో జరిగే ఫైట్ మరో ఎత్తు. అన్నట్లు మారిపోయింది కడప పరిస్థితి. కడప లోక్ సభ, పులి వెందుల అసెంబ్లీ స్థానాలు వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబానికే చెందిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు పార్టీల నుంచి పోటీ
 చేస్తుండటంతో ఈ సారి కడప ఎన్నికలు మరొకెత్తు అని అంటున్నారు పరిశీలకులు.


షర్మిళ కడప నుంచి పోటీ చేస్తుండటంతో టీడీపీ లోలోపల తెగ సంబరపడుతోంది. ఆమె పోటీ వల్ల వైసీపీ ఓట్లు చీలిపోతాయని.. ఫలితంగా వైసీపీ ఓడిపోతుంది. ఇది తమకు లాభిస్తోందని టీడీపీ భావిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతుంది వేరేగా ఉంది. అదెలా అంటే షర్మిళ కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. అక్కడ టీడీపీ 1983లో తప్ప మళ్లీ గెలిచింది లేదు.


కడపలో షర్మిళ వైసీపీ ఓట్లు చీలుస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ వైఎస్సార్ వారసుడిగా జగన్ వైపై ఆయన అభిమానులు.. అనుచరులు ఉన్నారు. పైగా షర్మిళ టీడీపీ అధినాయకత్వాన్ని ఏమీ అనకుండా కేవలం జగన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. ఇక షర్మిళకు టీడీపీ అనుకూల మీడియా అండగా నిలుస్తోంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి లాంటి వాళ్లు ఆమెకు అనుకూలంగా మాట్లాడటం వైసీపీ మద్దతు దారులతో పాటు ప్రజలు గమనిస్తున్నారు.


మరోవైపు గత నెలలో నిర్వహించిన వివేకా వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నేతలే వేదికపై అధికంగా కనిపించారు. ఈ మొత్తం చూసిన తర్వాత వైసీపీ అభిమానులు షర్మిళకు ఓటు వేయరని పలువురు పేర్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ ఓట్లే చీలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ వర్సెస్ షర్మిళ అన్నట్లు ఎన్నికలు నడిస్తే టీడీపీ ఓటు బ్యాంకు కచ్ఛితంగా టర్న్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి షర్మిళ అన్న పై కోపంతో చేస్తున్న రాజకీయం ఎవర్నీ ముంచుతుందో అర్థం కావడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: