రానున్న ఎన్నికల్లో విజేతపార్టీ అనేది జనం ఇప్పటికే నిర్ణయించారనే ఆలోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి. ఏపీలో ప్రజలు ప్రతిసారి విజేతను పూర్తి మెజార్టీతో గెలిపిస్తున్నారు. ఈ సారి కూడా విజేతను ఓటర్లు నిర్ణయించే ఉంటారనే ఆలోచనలో ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిని అన్ని ఎన్నికలు రెండు పార్టీల మధ్యే  జరిగాయి.


కాకపోతే ఈ సారి కాంగ్రెస్ రంగంలోకి దిగింది. అధికారం చేపట్టే సీట్లు రాకపోయినా.. ఏ పార్టీ ఓట్లు చీలుస్తుందో అనే ఆందోళన అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమిలోను ఉంది. గత ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి అని జగన్ అడగ్గానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రం విడిపోయిన  తర్వాత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయకత్వం కావాలని భావించారు. మరి ఈ సారి ఎవరికి ఓటు వేస్తారు అనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు.


కానీ ప్రచార పర్వంలో మాత్రం ఆయా పార్టీలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా సిద్ధం సభల తర్వాత వైసీపీ గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. ఇదే సమయంలో పలు సర్వేలు సైతం ఇదే విషయాన్ని బలంగా చెబుతున్నాయి. ఒక రకమైన వేవ్ వచ్చిందని.. ఇది తమకు లాభం చేకూరుస్తుందని వైసీపీ నాయకులు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు.


ఎన్డీయే కూటమి నేతలు కూడా పవన్, చంద్రబాబు ఉమ్మడి ప్రచారం తమకు లభిస్తుందని.. ఎక్కడ చూసినా సభలకు విశేష స్పందన వస్తుందని మాదే విజయం అనే ధీమాలో ఉన్నారు. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎన్నడూ లేనంతగా టఫ్ ఫైట్ నడుస్తోంది. అందుకే సర్వే సంస్థలు ఒక పార్టీకే అనుకూలంగా తమ ఫలితాలను వెల్లడించలేకపోతున్నారు. ముఖ్యంగా వైసీపీ పేదల ఓట్లను చాలా బలంగా నిలబెట్టుకోగలుగుతుంది. మధ్య తరగతి వారు మాత్రం టీడీపీ వైపు చూస్తున్నారు. అందుకే ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టతరంగా మారింది. మరి ఓటరు ఏ విధమైన తీర్పు ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: