
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు వేస్తున్న ప్రశ్న ఇప్పుడు వాళ్లకే ఎదురవుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే కొంతమంది పారిశ్రామిక వేత్తలు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రారు అని గ్యారెంటీ ఏంటి ?అంటూ తమను ప్రశ్నిస్తున్నారు అని వీళ్ళిద్దరూ నిన్న మొన్నటి వరకు పదే పదే చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే ప్రశ్న కొన్నిచోట్ల రైతుల దగ్గర నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో అధికారులకు ఎదురవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని కూటమీ ప్రభుత్వం అమరావతి రెండో దశ విస్తరణ కోసం 40 వేల ఎకరాల వరకు సమీకరించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే చాలాసార్లు అధికారికంగా చెప్పారు. రైతులు ఫూలింగ్ కింద తమ భూములు ఇస్తే ఓకే ... లేకపోతే భూ సేకరణ చట్టం కింద అయినా సరే అంతర్జాతీయ విమానాశ్రయం - స్పోర్ట్స్ సిటీ - స్పోర్ట్ ఇండస్ట్రీస్ కోసం భూములు తీసుకుంటామని చెబుతూ వస్తున్నారు. దీనికోసం రాజధాని ప్రాంతంలో పలుచోట్ల గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అయితే ఎక్కువ మంది రైతులు మాత్రం గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు తమ భూములు ఇవ్వటానికి రెడీగా లేము అని తేల్చి చెబుతున్నారు.
అమరావతి తొలిదశ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విస్తరణ గురించి ఆలోచించాలి కానీ.. వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కారే తిరిగి అధికారంలోకి వస్తుంది అని గ్యారెంటీ ఏంటి ? అని కొంతమంది రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అమరావతి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. మరోసారి తమ రాజకీయాలకు బలి కావాలా అని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారట. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూటమి సర్కారు తిరిగి అధికారంలోకి రాకపోతే చంద్రబాబు ప్రణాళికలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎందుకు అమలు ? చేస్తాయని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే అమరావతి కోసం ల్యాండ్ పోలింగ్ కింద 35 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు పదేళ్లపాటు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్లకు దక్కిన ప్లాట్స్ కు మంచి రెట్టు రావాలన్నా తొలిదశ అమరావతి పూర్తి కావాలి. ఇప్పుడున్న పరిస్థితులలో మరోసారి తాము ప్రభుత్వం చెప్పిన మాటలు విని మళ్లీ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చాలామంది రైతులు చెబుతున్నారు. అయితే అదనపు భూమి సేకరణ విషయంలో అవసరం అయితే భూ సేకరణ చట్టాన్ని కూడా ఉపయోగించడానికి తాము వెనకడం అని మంత్రి నారాయణ పదేపదే చెబుతుండడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కూడా ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు