రాజమౌళి మహేష్ బాబుల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీకి ప్రచారం జరుగుతున్నట్లుగా దేశప్రజలు అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ‘వారణాసి’ అన్న టైటిల్ ఫిక్స్ చేస్తూ జరిగిన ‘గ్లోబ్ ట్రాటర్’ వేడుకను చూసిన వారికి రాజమౌళి తీస్తున్న ‘వారణాసి’  మూవీ గ్లోబల్ ఆడియన్స్ భారత్ వైపు చూసేలా ఒక అద్భుతం తీస్తున్నాడని అర్థం అయింది. త్రేతాయుగంలో రామాయణ ఘట్టాన్ని యుగయుగాల వెనుక ‘వారణాసి’ ని వర్తమానంలో భూమిని ఢీ కొట్టబోతున్న ఒక ఉల్క కు సంబంధించిన కథను మిళితం చేస్తూ చేయబోతున్న ఒక కథ ఇది అని ఈ గ్లోబ్ ట్రాటర్ నిశితంగా చూసిన వారికి అర్థం అవుతుంది. 



ఎవరూ ఊహించని విధంగా ఈమూవీలో మహేష్ ను రాజమౌళి కొన్ని సన్నివేశాలలో రాముడుగా శ్రీరాముడుగా చూపించబోతున్నాడు. శ్రీరాముడు అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది నందమూరి తారకరామారావు మాత్రమే. అలాంటి సందర్భంలో మహేష్ ను శ్రీరాముడుగా చూపించడం ఒక సాహసం. ‘మహాభారతం’ తీయడం రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు జక్కన్న మహాభారతాన్ని పక్కకు పెట్టి రామాయణం వైపు అడుగులు వేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.



ఇది అంతా నాణానికి ఒకవైపు అయితే నిన్న అత్యంత ఘనంగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ వేడుక పై సోషల్ మీడియాలో వస్తున్న సెటైర్లు మహేష్  అభిమానులను కలవరపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకలో మహేష్ బాబుని డమ్మీ నందిపై కూర్చోబెట్టి స్టేజి మీదకు తెచ్చిన విధానం ఏమాత్రం ఎగ్జైటింగ్ గా లేదని నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. కమర్షియల్ ప్రోగ్రామ్ లా కోట్లు ఖర్చు పెట్టిన ఈ ఈవెంట్ లో  స్టేజి మీద కూడా స్పాన్సర్స్ తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడం నెగిటివ్ కామెంట్స్ కు అవకాశాన్ని ఇచ్చింది. 



దీనికితోడు ఈ ఈవెంట్ లో  వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ కాసేపు మొరాయించడంతో రాజమౌళి అసహనానికి గురి కావడం, యాంకర్ సుమ టైంని మేనేజ్ చేయలేకపోవడం కూడ ఈ కార్యక్రమానికి మైనస్ గా మారింది. ఏది ఎలా ఉన్నా ‘వారణాసి’ మూవీ దేశమంతా గర్వించే మూవీగా మారాలని రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని మహేష్ అభిమానులు మనసారా కోరుకుంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: