ఈ నోటిఫికేషన్‌లో మొత్తం మొత్తం 40 ఖాళీలను ప్రకటించింది ఇండియన్ ఆర్మీ. డెహ్రడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 2021 జనవరిలో వీరిని నియమిస్తారు. ఇక ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 40 ఖాళీలు ఉండగా.. అందులోసివిల్ ఇంజనీరింగ్- 10, ఆర్కిటెక్చర్- 01, మెకానికల్ ఇంజనీరింగ్- 03, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 4, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఇన్ఫోటెక్ / ఎంఎస్సీ కంప్యూటర్- 09, న్యూక్లియర్ టెక్నాలజీ- 01, ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 01 పోస్టులు ఉన్నాయి.
వీటితో పాటు ఏరోనాటికల్ / ఏవియానిక్స్- 02, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ / టెలీకమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / శాటిలైట్ కమ్యూనికేషన్- 06, ఏరోస్పేస్- 01, ఇండస్ట్రియల్ / మ్యానిఫ్యాక్చరింగ్- 01 మరియు లేజర్ టెక్నాలజీ- 01 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత విషయానికి వస్తే.. ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా పెళ్లికాని యువకులు మాత్రమే. వారి వయస్సు 20 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 26 చివరి తేదీగా ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ https://joinindianarmy.nic.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుని.. దరఖాస్తు చేసుకోవలెను.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి