బంగారం అనేది చాలా విలువైన ఆస్తి. మనం సంపాదించే దానిలో ఖచ్చితంగా కాస్తో కూస్తో బంగారం కొని కూడబెడుతుంటాం. మనం సాధారణంగా పండుగల, ఫంక్షన్‌లు లేదా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ధరించి, మిగతా సమయాల్లో భద్రంగా ఉంచుతాం. కానీ, అవసరం లేని సమయాల్లో బంగారాన్ని లీజుకు ఇచ్చి, దానిని ఆదాయ ఆస్తిగా మార్చుకోవచ్చు అని కూడా అంటున్నారు డీలర్స్.మీ బంగారాన్ని కొద్ది కాలానికి లీజుకు ఇవ్వడం ద్వారా మీరు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు బంగారాన్ని షాపుల యజమానులు, పెట్టుబడిదారులు, గోల్డ్ రిఫైనింగ్ సంస్థలకు లీజుకు ఇవ్వవచ్చు. ఈ అప్షన్ కూడా ఉంది.


ఉదాహరణకు, మీరు బంగారాన్ని 6 నెలల కాలం షాపుల యజమానులకు లీజుకు ఇస్తే, ఆ వ్యాపారి మీ బంగారాన్ని ఉపయోగించి కొత్త ఆభరణాలను తయారుచేసి, వాటిని విక్రయిస్తారు. 6 నెలల అనంతరం, మీకు మీరు ఇచ్చిన మొత్తం బంగారం తిరిగి వస్తుంది, అదనంగా వడ్డీ కూడా చెల్లిస్తారు.  దీనికి ఓ సపరేటు ప్రాసెస్ కూడా ఉంటుంది. ప్రతి దానికి పేపర్ ప్రూఫ్ కూడా చేయించాల్సి ఉంటుంది. బంగారం ధరలు పెరిగితే, వడ్డీతో పాటు అదనపు లాభం కూడా పొందవచ్చు.అలాగే, పెట్టుబడిదారులు లేదా సంస్థలకు బంగారాన్ని లీజుకు ఇచ్చినట్లయితే, అవి చివర్లో వడ్డీతో మీకు తిరిగి అందిస్తాయి. సాధారణంగా, బంగారాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా సంవత్సరానికి 1% నుంచి 7% వరకు ఆదాయం పొందే అవకాశముంది అంటున్నారు నిపుణులు.



ఇంకా, ఈ విధమైన సేవలను అందించే అనేక యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  మీరు డిజిటల్ గోల్డ్‌ను జ్యూవెల్లర్స్‌కి లేదా అద్దెకు ఇవ్వవచ్చు. లీజు ఇవ్వాలనుకున్న కాలాన్ని మీరు స్వయంగా నిర్ణయించవచ్చు. ప్రతిది కూడా మీ ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది.  ఈ విధంగా డిజిటల్ గోల్డ్‌ను లీజుకు ఇవ్వడం ద్వారా, వార్షికంగా 3% నుంచి 6% వరకు రిటర్న్స్ పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మరింతగా, 10 గ్రాముల బంగారం ఉన్నవారూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇండియాలో ఈ వ్యాపారానికి అధికారిక అనుమతులు కూడా ఉన్నాయి. అందువల్ల, ఇది చట్టపరంగా సురక్షితమైన వ్యాపారం. ఇటీవల, ఈ వ్యాపారం విస్తృతంగా సాగుతుందని కూడా కొంత మంది ప్రముఖులు ప్రత్యేకంగా చెప్పుకొస్తున్నారు.



నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని ఫాలో అవ్వాలి అని చెప్పడానికి కాదు. ఈ విషయం పై ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. ఏదైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి మీకు తగిన నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయాని పాఠకులు గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: