మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం కళ్లు...ఇవే లేకపోతే మనిషికి అంతా అందకారమయం.. మరి అలాంటి కళ్లను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం.  ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మంది కంటితోనే బాగా పనులు చేస్తున్నారు..కంప్యూటర్ జాబ్, సినిమాలు,టీవిలు వీక్షించడం, లాంగ్ డ్రైవింగ్ లాంటివి చేస్తుంటే కంటిపై చాలా వత్తిడి పడుతుంది. మరి ఇలాంటి వత్తిడిని దూరొ చేసుకొని మన కళ్లను ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.

కళ్లపై వత్తిడి తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

 మర్దన (మసాజ్) : స్వతహాగా కళ్ళకు మాసాజ్ చేసుకోటానికి ప్రయత్నించండి, కను రెప్పలపై, కంటి చుట్టూ ప్రాంతం(కంటి కండరాలు), కను బొమ్మలు, చెంపపై భాగంలో రోజులో కనీసం రెండు సార్లు అయిన మసాజ్ చేయటానికి ప్రయత్నించండి. ఫలితంగా మీ కంటి కండరాలు విశ్రాంతి చెందుతాయి, స్వతహాగా చేయటం వలన కంటి పై అధిక పీడన ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చు. కంటి చుట్టూ ఉండే పూర్తీ ప్రాంతాన్ని మసాజ్ చేయటం వలన కంటి కండరాలు విశ్రాంతికి గురవటం వలన కంటిపై కలిగే ఒత్తిడి తగ్గిపోతుంది.మీ కంటి పై ఉండే కను బొమ్మల ప్రాంతంలో ఉండే ఎముకను కనీసం 10 సెకన్ల పాటూ మసాజ్ చేయండి, తరువాత కంటి కింది భాగంలో కూడా ఎముక ఉంటుంది, ఈ ప్రాంతంలో కూడా 10 సెకన్ల పాటూ మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన కన్నీటి గ్రంధులు ప్రవానికి గురై కళ్ళు పొడిబారే ప్రక్రియ తగ్గుతుంది.


చల్లటి నీరు : చల్లటి నీరు, మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తాయి. నీటిలో మంచు గడ్డలను కలపటం వలన మంచి ఫలితాలను పొందుతారు. శరీర ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నవారు ఇలా చేయటం మంచిది కాదు. 3 నుండి 7 నిమిషాల పాటూ కులాయి కింద మీ తలను ఉంచండి, మీ మెడ పైన కూడా చల్లటి నీటి దారాలు కారేలా చూసుకోండి.


చాలా వరకు కళ్ళకు విశ్రాంతి కలిగించండి : కళ్ళకు విశ్రాంతి లేకుండా పని ద్వారా ఒత్తిడి కలిగించటం వలన కళ్ళు పూర్తిగా ప్రమాదానికి గురై, ద్రుష్టిలోపాలు కలిగే అవకాశం ఉంది. కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువ సమయం పాటూ పని చేస్తే కనీసం 20 నిమిషాలకు ఒకసారైన దృష్టిని మరల్చి  చూడండి.   


కను రెప్పలను వాల్చండి : మీ కను రెప్పలను క్రమంగా వాల్చటం చాలా ముఖ్యం, దీని వలన మీ కళ్ళు రిఫ్రెష్ అవుతాయి. కను రెప్పలను తక్కువగా వాల్చే వారిలో కళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురవటం లేదా కళ్ళు నొప్పిగా అనిపించటం వంటివి కలుగుతాయి. అంతేకాకుండా, మీ కను రెప్పలను వాల్చినపుడు కళ్ళ నుండి కన్నీరు విడుదల అవుతుంది, ఇలా కన్నీరు విడుదలై రిఫ్రెష్’కు గురవుతాయి. కావున కళ్ళపై ఒత్తిడి కలిగేలా పని నిర్వహించే సమయంలో కను రెప్పలను వాల్చటం మరవకండి.


మరింత సమాచారం తెలుసుకోండి: