మారుతున్న కాలం, పెరుగుతున్న కాలుష్యం తో పాటుగా ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయింది. దీంతో మనిషి ఆరోగ్య స్థితిగతులు కూడా పూర్తిగా మారిపోయాయి. డబ్బు మీద వ్యామోహం తో ఆహారపు అలవాట్లను కూడా మార్చుకున్నారు. అనారోగ్య సమస్యల ను  కొని తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత డబ్బులు వదిలించు కోలేక బాధపడతారు. ఇప్పుడు అలాంటివి సర్వసాధారణం అయ్యాయి. వాటి నుంచి ఉపశమనం పొందడాని కి ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా అవి బెడిసి కొడుతున్నాయి. దాంతో డాక్టర్ల దగ్గరకు పరిగెడుతున్నారు.

ఒత్తిడి అనేది ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సమస్య కారణంగా కుటుంబ సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక ఒత్తిడి ని తగ్గించేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే వాటిని ఉపయోగించి ఒత్తిడిని తగ్గించ్చును అని నిపుణులు అంటున్నారు. తాజా కూరగాయాలు, పండ్లను తింటే ఒత్తిడి తగ్గుతుంది అట.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పండ్లు, కూరగాయల తో కూడిన సమతులా హారం తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని తేలింది. పండ్లు, కూరగాయలు, ఒత్తిడి కీ మధ్య ఉన్న లింక్‌ గురించి తెలుసుకోవడం కోసం 25 నుంచి 91 ఏళ్ల మధ్య ఉన్న 8,600 మంది ఆస్ర్టేలియన్ల మీద ప్రయోగాలు చేపట్టినట్టు క్లినికల్‌ న్యూట్రిషన్‌ అనే జర్నల్‌ లో ప్రచురితమైన ఈ అధ్యయనం లో వెల్లడించారు. 230 గ్రాముల పండ్లు, కూరగాయలు తిన్నవారి కంటే 470 గ్రాముల పండ్లు, కూరగాయలు తిన్న వ్యక్తుల ఒత్తిడి 10 శాతం తక్కువ  గా ఉన్నట్టు ఈ అధ్యయనాల్లో తేలింది. ఒత్తిడి అదుపు లో ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 400 గ్రాముల కు తగ్గకుండా పండ్లు, కూరగాయలు తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.. మీరు కూడా పండ్ల ను తినండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: