ఈరోజులలో ఎంత ఆరోగ్య నియమాలు పాటించినప్పటికీ 60ఏళ్ళు ఆయుష్షు మత్రమే అంటున్నారు. అలాంటిది 90 లు దాటేసి, వంద కూడా దాటేసి మరో దశాబ్దానికి దగ్గరవుతున్నారు కొందరు. ఇలాంటి వారిని చాలా అరుదుగా చూస్తాము. అదే వీళ్లు కావలలైతే ఇంకా అరుదు కదా. జపాన్ కు చెందిన ఈ కవలలు ఆ అరుదైన ఘనత సాధించారు. ఈ రోజులలో కూడా వాళ్ళు 107 ఏళ్ళు జీవించే ఉన్నారు. పైగా కవలలు, దీనితో ప్రపంచ గిన్నిస్ సంస్థ తమ బుక్ లో వీరికి స్థానాన్ని కల్పించింది. గతంలో ఇలాంటి రికార్డు కూడా జపాన్ పేరు మీదే ఉండటం విశేషం. అప్పటి వృద్ధుల వయసు 107 ఏళ్ళ 175 రోజులు కాగా ప్రస్తుతం అది 107ఏళ్ళ 330 రోజులుగా నమోదు చేశారు.  

వీళ్లు పుట్టడం అయితే కవలలు కానీ, కుటుంబ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు వేరేవేరే చోట్ల పెరగాల్సి వచ్చింది. వివాహాలు కూడా అదే విధంగా జరిగాయి. ఎప్పుడో కుటుంబ ఉత్సవాలు జరిగినప్పుడు చుట్టాల మాదిరి కలుసుకోవడం తప్ప పెద్దగా కలిసి కూడా  వీరిద్దరూ. అందుకే కాస్త వయసు వచ్చాక ఇద్దరు కలిసి జీవించాలని అనుకున్నారేమో ఇటీవలే బౌద్ధ యాత్ర ద్వారా కలిసి జీవిస్తున్నారు. ఈ సమయంలో గిన్నిస్ రికార్డు వారు వారికి వచ్చిన ఘనతను తెలిపి, అధికార పత్రాలను వారికి అందించారు. దానిని చూసుకొని సంతోషించారు అనుకుంటే వీలులేదు. అందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం వలన వారికి జ్ఞాపక శక్తి లోపించి ఈ ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం లేకపోయింది. మరో మహిళ మాత్రం తమకు ఈ ఘనత లభించడం సంతోషంగా ఉందని తెలిపింది.  

1913లో జపాన్ లో షాడో దీవిలో వీరు జన్మించారు. వీరిపేర్లు ఉమెనో సుమియామా, కోమె కొడామా. వీరి తల్లిదండ్రులకు 11మంది సంతానం. వీరు 3వ కాన్పులో కవలలుగా జన్మించారు. కవలలుగా జన్మించినప్పటికీ రూపం మాత్రమే ఒక్కటిగా ఉండేదని, అభిప్రాయాలు మాత్రం విరుద్ధంగా ఉండేవని వీరి గురించి చెపుతున్నారు. ఒకరు సున్నితంగా ఉంటె, మరొకరు దృఢమైన మనస్తత్వంతో ఉండేవారట. జంటగా పుట్టినప్పటికీ పాఠశాల విద్య అనంతరం ఇద్దరు వేరేవేరే ప్రాంతాలలో పెరిగారు. వివాహాలు కూడా అలాగే జరిగిపోవడంతో ఇప్పటివరకు కలిసి జీవించింది లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: