ఇక డ్రాగన్ ఫ్రూట్ గురించి ఎప్పుడైన విన్నారా? ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒకప్పుడు మనకు పెద్దగా అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు అయితే విరివిగా లభ్యం అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కాస్త ఖరీదు ఎక్కువగా ఉన్నా సరే దానికి తగ్గట్టుగా ప్రయోజనాలను కూడా అది కలిగి ఉంటుంది.కాబట్టి మీరు కూడా డ్రాగన్ ఫ్రూట్ ని తినటానికి ప్రయత్నం చేయండి.డ్రాగన్ ఫ్రూట్ అనేది కాక్టస్ కుటుంబానికి చెందిన ఫ్రూట్. ఇక దీని శాస్త్రీయ నామం హైలోసరస్ అండాటస్. డ్రాగన్ ఫ్రూట్ ని పిటాయా ఇంకా అలాగే స్ట్రాబెర్రీ పియర్‌ అని కూడా పిలుస్తారు. ఇది రాళ్ళపై లేదా మట్టిలో పెరిగే ఒక మొక్క. డ్రాగన్ ఫ్రూట్ మెక్సికో, మధ్య అమెరికా ఇంకా అలాగే దక్షిణ అమెరికా దేశాల్లో బాగా పెరుగుతుంది. చైనా ఇంకా అలాగే వియత్నాం దేశాల నుంచి ఈ పండ్లు ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి.ఇక ఈ మధ్య కాలంలో అయితే భారతదేశంలో కూడా సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ లో ఎన్నో రకాల పోషక విలువలు ఉండటం వలన ఈ పండు ఆమధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది.



మార్కెట్ లో ఎక్కువ ధర పలికే డ్రాగన్ ఫ్రూట్ మంచి రుచిని కలిగి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ సైజ్ ని బట్టి 200 నుంచి 250 వరకు దీని ధర ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎంతగానో మేలును చేస్తాయి.ఈ డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన ఆర్థరైటిస్ (కీళ్ళనొప్పులు) ఇంకా వాటి వలన కలిగే సమస్యలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ కారణంగా వచ్చే తీవ్రమైన చికాకు నుండి కూడా ఇది మంచి ఉపశమనం కలిగిస్తాయి.డ్రాగన్ ఫ్రూట్ లో కాల్షియం, పాస్పరస్, ఐరన్ ఇంకా నియాసిన్ మరియు ఫైబర్ లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఇది కాపాడుతుంది. వీటిలో ఉండే విటమిన్ 'C', మినరల్ ఇంకా అలాగే ఫైటో (వృక్ష ఆధారిత) అల్బుమిన్ లు యాంటీ ఆక్సిడెంట్ చర్యలను ప్రేరేపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: