మెదడు ఆరోగ్యం కోసం ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవాలి.బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ ఇంకా అలాగే స్ట్రాబెర్రీస్ వంటివి బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచడంలో చాలా బాగా సాయపడతాయి. పండిన బెర్రీలు ఎక్కువ కాలం ఉండవు కాబట్టి (ఫ్రిజ్‌లో కూడా) వాటిని త్వరగా తినాలి. బీన్స్, చిక్కుళ్ళు ఇంకా కాయధాన్యాలు కూడా ఆరోగ్యకరమైన అలాగే చవకైన పదార్థాలు. వీటిలో పోషకాలు, విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.మార్కెట్లో దొరికే అన్ని రకాల కూరగాయాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవడం మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో మెదడుకు ప్రయోజనకరమైన పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయని సూచిస్తున్నారు. అలాగే పండ్లలో కూడా యాపిల్స్, పైనాపిల్స్, కివీస్ ఇంకా సిట్రస్ తీసుకోవడం చాలా మంచిది. అయితే ద్రాక్ష, మామిడి వంటి తీపి పండ్లను అతిగా తినకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది.ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.


డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్ల చాలా ఎక్కువ ఉంటాయి. అయితే దీనిలో చక్కెర స్థాయిలను మాత్రం తగ్గించి తీసుకోవాలి.ఇంకా అలాగే మీ మెదడు బాగా పనిచేయడానికి అవసరమైన ప్రోటీన్లు ఇంకా అమైనో ఆమ్లాలు ఎక్కువగా లభించే పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. లీన్ పౌల్ట్రీ, సీఫుడ్ ఇంకా గుడ్లలో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి.గింజలు, విత్తనాలలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వులు, నూనెలు ఉంటాయి. ఇవి మీ మెదడును బాగా పదును పెట్టడంలో ఎంతగానో సహాయపడతాయి. బ్రెజిల్ గింజలలో సెలీనియం వంటి  విటమిన్లు ఇంకా ఖనిజాలు కూడా ఉన్నాయి. అవిసె, చియా ఇంకా అలాగే జనపనార వంటి విత్తనాలు కూడా మంచివి. వీటిని స్నాక్‌గా లేదా సలాడ్ లేదా వెజిటబుల్ సైడ్ డిష్‌లో కలిపి రోజూ తీసుకుంటే మెదడు ఆరోగ్యానికి సహాయం చేస్తాయి.అలాగే ఆరోగ్యానికి ఫైబర్ కూడా చాలా అవసరం. మీ బరువును సమతుల్యంగా ఉంచడంలో ఫైబర్ బాగా సహాయపడుతుంది. పులియబెట్టిన ఆహార పదార్థాల్లో ఆరోగ్యాన్ని పెంపొందించే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: