మన శరీరానికి చెమట పట్టడం సహజమే కానీ చెమట నుండి వచ్చే దుర్వాసన మాత్రం మనల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ దుర్వాసన కారణంగా మనతో పాటు మన చుట్టూ ఉండే వారు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన శరీరం నుండి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం చెమట. ఈ చెమటకు ఉప్పు, బ్యాక్టీరియా వంటివి చేరడం వల్ల బాగా దుర్వాసన వస్తుంది. ఇంకా అలాగే ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నప్పుడు, అధిక బరువు వల్ల కూడా శరీరం నుండి దుర్వాసన చాలా ఎక్కువగా వస్తుంది.ఇక కొందరిలో అయితే జన్యుపరంగా కూడా దుర్వాసన వస్తుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి డియోడ్రెంట్ లను ఇంకా ఫర్ ఫ్యూమ్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి చక్కటి వాసన కలిగి ఉన్నప్పటికి వీటి తయారీలో ఎక్కువగా రసాయనాలను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల చర్మంపై అలర్జీలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల హోమ్ టిప్స్ ఉపయోగించడం వల్ల మనం ఈ సమస్యను చాలా సలుభంగా అధిగమించవచ్చు.


ఈ చెమట వాసనను తొలగించడంలో నిమ్మకాయ చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. స్నానం చేసే నీటిలో నిమ్మరసాన్ని వేసి కలిపి స్నానం  చేయడం వల్ల శరీరం నుండి చెమట వాసన అనేది మీకు రాకుండా ఉంటుంది.ఇంకా అలాగే సువాసనలు వచ్చే సబ్బులు కాకుండా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన సబ్బును వాడడం చాలా మంచిది. అలాగే సువాసన వచ్చే పౌడర్ లను ఇంకా మాయిశ్చరైజర్ లను ఉపయోగించడం తగ్గించాలి. అదే విధంగా గ్రీన్ టీ ని వాడడం వల్ల కూడా మనం చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. స్నానం చేసే నీటిలో గ్రీన్ టీ ని వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరంపై ఉండే బ్యాక్టీరియాలు నశించి దుర్వాసన రాకుండా ఉంటుంది.ఇంకా అదే విధంగా మనం తీసుకునే ఆహారం కారణంగా కూడా చెమట దుర్వాసన ఎక్కువగా వస్తుంది.అందుకే ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.శరీరం నుండి దుర్వాసన ఎక్కువగా వచ్చే వారు రెడ్ మీట్ ను, మసాలా వంటకాలను ఇంకా అలాగే ఆల్కాహాల్ ను తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: