అరటి.. ప్రపంచంలో ఎక్కువగా తినే పండు.  అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో అరటిపండు ముఖ్యమైనది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ మూడు అరటిపండ్లు తింటే గుండెపోటు సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అరటి పండులో విటమిన్స్,మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. యాసిడిటి సమస్యలను అరటి తొందరగా అరికడుతుంది.

 

అయితే చాలా వరకూ అన్నీ ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అలా పెడితే అవి చాలా రోజుల వరకూ తాజాగా ఉంటాయని అంటారు. అయితే, అరటిపండ్ల విషయంలో మాత్రం అలా పెట్టకూడదు అని చెబుతున్నారు. అరటి పండ్లు మగ్గడానికి పొడి వాతావరణం అవసరం. అందుకని వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అంతేకాదు ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల సరిగా పండకపోగా, పండు పైతోలు నల్లబడి పోతుంది. పండు రుచీ తగ్గుతుంది. అందుకే ఫ్రిజ్‌లో పెట్టి తిన‌కూడ‌ద‌ని చెబుతున్నారు.

 

ఇక ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి రక్త హీనత రాకుండా చేస్తుంది. అలాగే బాగా పండిన అరటి పండులో ఉండే అధిక కార్బోహైడ్రేట్స్ మరియు షుగర్ కంటెంట్ సహజ సిద్దమైన ఎనర్జీ బూస్టర్స్ వలె పనిచేస్తాయి. క్రమంగా శారీరిక శక్తి స్థాయిలు మెరుగవుతాయి. అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మరియు సోడియం నిక్షేపాలు తక్కువగా ఉంటాయి. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి లాభదాయకంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: