ముఖానికి నల్లమచ్చలు ఎక్కువగా ఉంటే వాటిని పోగొట్టుకోవడానికి ఈ విధంగా చేయండి.ఒక టీ స్పూన్ తేనెలో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పైన ఉన్న మచ్చలు తొలగిపోవడమే కాకుండా, ముఖం కాంతివంతంగా ఉంటుంది.
చర్మం పొడిబారకుండా ఉండాలంటే బంగాళదుంపను కొత్తగా ఉడికించుకొని అందులోకి కొంచెం పాలపొడి,కొంచెం బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవడం వల్ల పొడిబారిన చర్మానికి తేమను అందిస్తుంది.
కళ్ళకింద నల్లని మచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంపలను ముక్కలుగా కోసి కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఆ తర్వాత కళ్లపై పెట్టుకోవడం వల్ల కళ్ల కింద ఉన్న నల్లని మచ్చలు తగ్గుముఖం పడతాయి.
నారాంజ తొక్కలను తీసి ఐదు నిమిషాల పాటు బాగా ఉడకబెట్టాలి.చల్లారిన తర్వాత మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేయడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.
ముల్తానీ మట్టి తీసుకొని అందులోకి ఒక చెంచా బంగాళదుంప గుజ్జు, నాలుగు చుక్కలు రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసి 25 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.ఆ తర్వాత చల్లటి నీటిలో ముంచిన వస్త్రములు తీసుకొని బాగా తుడుచుకోవాలి చేయడంవల్ల చర్మం తాజాగా ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి