మనలో చాలా మంది ప్రస్తుతకాలంలో మరీ ఎక్కువగా బరువు తగ్గాలనే ఆలోచనతో, చపాతీలను కేవలం రాత్రిపూట మాత్రమే తింటున్నారు. అన్నం తింటే ఎక్కడ బరువు పెరుగుతామేమో అన్న భయంతో, అన్నం వదిలేసి, చపాతీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అయితే రాత్రిపూట చపాతీలు మాత్రమే తీసుకున్నప్పటికీ ,ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాత్రిపూట చపాతీలను తినడం వల్ల ఎలర్జీలు, గ్లూటెన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇక అంతేకాకుండా తలనొప్పి,విరేచనాల వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట పూర్తిగా అన్నం మానేస్తే మాత్రం,ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే గోధుమ పిండితో చేసిన చపాతీల వల్ల శరీరంలో చేరే గ్లూటెన్, గ్లయాటిన్ అనే ప్రోటీన్లు ప్రేగులకు అడ్డుకుంటాయని..ఫలితంగా అజీర్తి, జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రోజు రాత్రి పూట ఒక చపాతి మాత్రమే తీసుకుంటూ, కొద్దిగ అన్నం కూడా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్లో దొరికే గోధుమపిండి వల్ల షుగర్ లెవెల్స్ ఏమాత్రం తగ్గవని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. మీకు అంతగా తినాలనిపిస్తే, గోధుమలను పిండి చేసి, చపాతీ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
డయాబెటిక్ రోగులు చపాతీలను తినడం వల్ల, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అనే అపోహలో ఉంటారు. అయితే షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే గ్లైసమిక్ ఇండెక్స్ అన్నం తో పోలిస్తే చపాతీ లో కొంచెం మాత్రమే తక్కువగా ఉంటుంది. దీనికి బదులు దంపుడు బియ్యం తింటే సరిపోతుంది.అలాగే కొర్రలు, అరికెలు కూడా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయని వారు సూచిస్తున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహరం తీసుకోవడం, నిత్యం వాకింగ్ చేయడం లాంటివి అలవాటు చేసుకుంటే బరువు తగ్గుతారు తప్పా రాత్రి పూట కేవలం చపాతి మాత్రమే తింటే బరువు తగ్గుతారనే అపోహ నుంచి బయటపడాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి