
వెన్నెముకకు బలాన్నిచ్చే వ్యాయామాలు రోజూ చేయడం వల్ల నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు.
నడుముకు దెబ్బ తగిలినప్పుడు నొప్పి, వాపు వస్తుంటాయి.ఇలాంటి సమయంలో నొప్పి ఉన్న చోట చల్లని లేదా వేడి వాటితో కాపడం పెట్టడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
నడుము నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది.కానీ శాంతిని కాసేపు తీసుకోకూడదు. కొంత సమయం మాత్రమే తీసుకోవాలి.
నడుము నొప్పితో ఎక్కువ బాధ పడుతుంటే 100 గ్రాములు గసగసాలను మెత్తగా నూరి పొడి చేసుకుని ఈ పొడిని ఒక చెంచా మోతాదులో గ్యాస్ ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకుని తాగాలి.
నడుము నొప్పి బాధ నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నూనె గానీ, నీలగిరి తైలం కానీ,గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్నచోట మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి విముక్తి కలుగుతుంది.
నొప్పి ఉన్న చోట సహజసిద్ధమైన పద్ధతులు పాటించడం తో పాటు శరీరంపై తక్కువ తీవ్రతను చూపే యోగ,ఈత వంటి సులభమైన వ్యాయామాలు చేయాలి.
నడుము నొప్పితో పాటు జ్వరము, మలబద్ధకం,మూత్ర విసర్జన మీద పట్టు కోల్పోవడం మొదలైన సమస్యలు బాదిస్తుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.