ఈ తేజ్ పత్తా ఏంటి ? అని ఆలోచిస్తున్నారా ? హిందీ భాష తెలిసిన వారికి ఈ మాత్రం అర్థం అయి వుంటుంది. ఎందుకంటే బిర్యానీ ఆకులనే హిందీలో తేజ్ పత్తా అంటారు కాబట్టి..బిర్యానీ ఆకునే,  తేజ్  పత్తా అని పిలుస్తారు.  భారతీయులు ఎంతో కాలం నుంచి ఈ ఆకులను  తమ వంటింటి లో సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా ఉపయోగిస్తారు. ఈ ఆకులు  మంచి చక్కని సువాసనను కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో వేయడం వల్ల చక్కని రుచి వస్తుంది. ముఖ్యంగా  బిర్యానీ లలో ఎక్కువగా ఈ ఆకులు వేస్తుంటారు. అయితే ఈ ఆకుల వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

1).తేజ్ పత్తా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సీ , ఐరన్, పొటాషియం, క్యాల్షియం వంటి తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

2). ఈ ఆకులను మనం వండే ఆహార పదార్థాల్లో అప్పుడప్పుడు వేసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఆకలి లేని వారికి ఆకలి పుట్టించడంలో చాలా సహాయపడుతుంది.

3).తేజ్ పత్తా ఆకులతో చేసిన టీని రోజూ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో చక్కెర స్థాయిలు తగ్గడమే కాక, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. ఈ వివరాలను క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్ జర్నల్లో 2009 లో ప్రకటించారు.

4). తేజ్ పత్తా ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్దకం సమస్య ను తగ్గిస్తాయి.

5). ఈ ఆకులతో చేసిన టీని తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు.

6). ఈ ఆకులతో చేసిన టీని తాగితే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మన శరీరంలోని వాపులు తగ్గుతాయి.

తేజ్ పత్తా ఆకులతో టీ ని ఇలా తయారు చేయండి !

టీ చేయడానికి కావలసిన పదార్థాలు:
•బిర్యానీ ఆకులు-3
•దాల్చిన చెక్క పొడి-చిటికెడు
•నీళ్లు-2గ్లాసులు
•నిమ్మరసం, తేనె-కొంచెం తీసుకోవాలి.

తయారు చేసే విధానం:
ఒక పాత్రలో నీటిని తీసుకొని బాగా మరిగించాలి. అలా మరిగిన నీటిలో కి తేజ్  పత్తా ఆకులు , దాల్చిన చెక్క పొడి వేసి మరో పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని వడగట్టాలి. అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. దీన్ని రోజూ ఉదయాన్నే తాగితే పైన తెలిపిన విధంగా అన్ని ఫలితాలు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: