సాధారణంగా శనగలలో మనకు కార్బోహైడ్రేట్లు, ఐరన్, మాంసకృత్తులు, పొటాషియం, క్యాల్షియం , విటమిన్ ఏ, జింక్, మెగ్నీషియం, విటమిన్ బి 6, విటమిన్ సి , ఫోలేట్, ఫాస్పరస్ వంటి ఎన్నో పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ ప్రయోజనాలు నల్ల శనగలలో ఎక్కువగా లభిస్తాయి అని చెప్పవచ్చు.. ముఖ్యంగా నల్ల శనగల లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి తప్పకుండా చిరుతిండిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.. నల్ల శనగలు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఒకరోజు రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉడకబెట్టి తింటూ ఉంటాం..

నానబెట్టిన నీటిని పారేస్తూ ఉంటారు .. అయితే అలా పారవేయడం వల్ల ఎన్నో పోషకాలను కోల్పోతాము. అయితే శనగలలో మనకు ఎన్ని పోషకాలు కలుగుతాయో సెనగలు నానబెట్టుకున్న నీటిలో కూడా అన్ని పోషకాలు మనకు లభిస్తాయి.. నానబెట్టిన నీటిని తాగడం వల్ల నల్ల శనగలు లో ప్రోటీన్,  ఫైబర్ , క్యాల్షియం, విటమిన్ వంటివి ఉంటాయి కాబట్టి శరీరంలోని ఎన్నో సమస్యలను తొలగించడంలో ఈ పోషకాలు సహాయపడతాయి.. ఇక నల్ల శనగలను ఒక రోజు ముందు రాత్రి  నీటిలో నానబెట్టడానికి ముందు  బాగా కడిగి ఒక గిన్నెలో వేసి రాత్రంతా నాననివ్వాలి.

ఇప్పుడు మరో గిన్నెలో నీళ్ళు పోసి ఈ కడిగిన శనగలు వేసి పూర్తిగా ఒక రాత్రంతా నాననివ్వాలి.. ఉదయాన్నే లేవగానే ఆ నీటిని వడగట్టి కొని ఖాళీ కడుపుతో తాగితే ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఒకవేళ కావాలి అనుకుంటే కొద్దిగా వేడిచేసి కూడా అందులో ఉప్పు, నిమ్మరసం కలిపి తాగవచ్చు. ఈ నీటిలో బలమైన రోగనిరోధక శక్తి మనకు అందుతుంది.. ఏదైనా వ్యాధి లేదా వైరస్ నుండి విముక్తి పొందాలి అంటే మనకు రోగనిరోధక శక్తి అవసరం కాబట్టి ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నల్ల సెనగలు నానబెట్టిన నీటిని తాగడం వలన మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి

మరింత సమాచారం తెలుసుకోండి: