వైద్యులను సంప్రదించ కుండా ఇంటి పట్టునే ఉండి పోయింది. చివరికి క్రమ క్రమం గా పెరిగి పోయిన ఆ కణితి ఏకంగా 47 కిలోల వరకు అయ్యింది. దీంతో కడుపు ఊహించని రీతిలో పెద్దగా అయి పోయింది. మహిళా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. గుజరాత్లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. 56 ఏళ్ల ఓ మహిళ పొత్తి కడుపులో ట్యూమర్ ఏర్పడి క్రమ క్రమంగా పెరిగి పోయింది. దాదాపు 18 ఏళ్ల క్రితం ఆమె శరీరం లో కణితి ఏర్పడగా నలభై ఏడు కేజీల వరకు పెరిగిపోయింది ఆ ట్యూమర్.
ఇకపోతే ఇటీవలే ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ మహిళ వైద్యులను సంప్రదించింది. అహ్మదాబాద్కు చెందిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి ట్యూమర్ను తొలగించారు. అయితే ఆపరేషన్ చేసి 47 కేజీల కణితి తొలగించడంతో ఇక ఆ మహిళ బరువు ఒక్కసారిగా తగ్గి పోయింది. ఏకంగా 49 కేజీలకు చేరుకుంది అని వైద్యులు చెబుతున్నారు. అయితే శరీరంలో ఈ స్థాయిలో కణితి ఏర్పడటం తమను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ వైద్యులు చెబుతున్నారు. ఒక మనిషి శరీరం నుంచి నలభై ఏడు కేజీల కణితి తొలగించడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి