మొన్నటి వరకూ ప్రపంచం మొత్తం కనిపించని శత్రువు తో పోరాటం చేసింది. కరోనా ఎటు వైపు నుంచి దాడి చేసి ప్రాణాలు తీస్తోంది అని అను క్షణం భయ పడుతూనే బ్రతికారు ప్రపంచ ప్రజానీకం. ఈ క్రమం లోనే ఎంతోమందినీ మహమ్మారి కరోనా వైరస్ బలితీసుకుంది. ఎన్నో కుటుంబాలను శోక సంద్రంలో కి నెట్టింది . ఇక అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తం కావడంతో ప్రభుత్వాలకు అటు ప్రజల నుంచి కూడా మద్దతు అందడం తో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది అన్న విషయం తెలిసిందే.


 ప్రస్తుతం పలు రకాల కొత్త వేరియంట్ లు వెలుగులోకి వచ్చినా వాటి ప్రభావం తక్కువగా ఉందని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గినప్పటికీ మొన్నటివరకు వైరస్ బారిన పడిన వారు మాత్రమే ఈ మహమ్మారి ప్రభావం కారణంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అని తెలుస్తోంది. కరోనా వైరస్ బారినపడి కోరుకున్న వారిలో దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయ్ అన్నది ఇటీవలే పలువురు నిపుణులు నిర్వహిస్తున్న అధ్యయనాల్లో వెల్లడి అవుతుంది. గుండె ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు.


 అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది అని పలు అధ్యయనాల్లో నివేదికలు చెబుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఆసక్తికర విషయం కూడా తెరమీదికి వచ్చింది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత అవయవాలు దెబ్బ తినడమే కాదు ఎముకలు కూడా కొంత అరిగిపోతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధనలో తేలింది. కరోనా చికిత్స తీసుకుంటున్నప్పుడు లేదా కోలుకున్న తర్వాత ఎముకల అరుగుదల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక కరోనా సోకిన ఎలుకలపై పరిశోధన చేయగా ఎముకలు 20 నుంచి 50 శాతం క్షయానికి గురి అయినట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: