పాలలో ఒక చెంచా అవిసె గింజలు వేసి ఉడికించాలి. బాగా మరిగిన తర్వాత పాలలో అవిసె గింజల గుణాలు మరింత పెరుగుతాయి. అనంతరం గింజలను వడపోసి వేరు చేసి పాలు తాగొచ్చు.. లేదా అలానే వాటిని తినొచ్చు. అవిసె గింజలకు బదులుగా దాని పొడిని కూడా కలపుకుని తాగవచ్చు. ఈ పాలను రాత్రి వేళ పడుకునే ముందు తీసుకుంటే శరీరానికి చాలామంచిది.యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అవిసె గింజలలో ఉన్నాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. అవిసె గింజలు, పాలు తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన అనేక సమస్యలు దూరమవుతాయి.అవిసె గింజలు, పాలు రెండింటిలో కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అవిసె గింజలను పాలలో మరిగించి తీసుకుంటే కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి.


అవిసె గింజల్లో ఉండే పీచు బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు అధిక బరువు ఉన్నట్లయితే.. ప్రతిరోజూ అవిసె గింజలను తినవచ్చు. అవిసె గింజలు, పాలు రోజంతా శక్తితో ఉంచుతాయి. ఇంకా కొవ్వును కరిగించి బరువును తగ్గించడంలో సహాయపడతాయి.అవిసె గింజలు మధుమేహ బాధితులకు చాలా మేలు చేస్తాయి. అవిసె గింజలను పాలలో మరిగించి రోజూ తాగితే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా తాగడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది.ఫ్లాక్స్ సీడ్‌లో ఫైబర్ గణనీయమైన మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. అవిసె గింజలను పాలలో మరిగించి తాగితే జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అవిసె గింజలు ప్రేగులకు చాలా మేలు చేస్తాయి. దీంతో ఉదర సంబంధిత సమస్యలకు కూడా దూరమవుతాయి.


అవిసె గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొవ్వులు ఉన్నాయి. అవిసె గింజలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. అయితే.. అవిసె గింజలను పాలలో కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: