మన ఆయుర్వేదంలో  నీలగిరి ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వీటిని నొప్పుల నివారణగాను యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన ఔషధంగా గుర్తిస్తూ ఉంటారు. నీలగిరి చెట్లు ఎక్కువగా చల్లటి ప్రదేశాలలో ఇంకా కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇక ఇవి భూగర్భ జలాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి.అందుకే ఇవి పర్వతప్రాంతాలు నదీతీరాల్లోనే చాలా ఎక్కువగా పెరగడం మనం గమనించవచ్చు. ఇంకా వీటి ఆకుల నుంచి నీలగిరి తైలాన్ని తీస్తారు. నీలగిరి తైలం ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.నీలగిరి తైలం సబ్బులు, క్లెన్సర్లు, స్టెయిన్ రిమూవర్లు, లాండ్రీ డిటర్జెంట్ ఇంకా అలాగే గార్డెన్ స్ప్రే వంటి చాలా గృహ శుభ్రపరిచే ఉత్పత్తులను తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నీలగిరి తైలం చాలా ఆహ్లాదకరమైన వాసన కలిగి ఉంటుంది. ఇది తివాచీలు,బట్టలపై నూనె, సిరా ఇంకా గమ్ వల్ల ఏర్పడ్డ కఠినమైన మరకలను కూడా చాలా సులభంగా తొలగించగలదు.ఈ నీలగిరి తైలం నూనెను చర్మంపై పూసినప్పుడు దోమలు ఇంకా ఇతర కీటకాలను చాలా సమర్థవంతంగా నిరోధించవచ్చు.ఇక నీలగిరి తైలం మన చర్మంలో ఉండే సిరామైడ్ అనే కొవ్వు ఆమ్లం ఉత్పత్తిని పెంచడం ద్వారా పొడి చర్మాన్ని బాగా మెరుగుపరుస్తుంది.సోరియాసిస్ ఇంకా చుండ్రు సమస్యతో ఎక్కువగా బాధపడుతున్న వ్యక్తులు జుట్టుకి నీలగిరి తైలం నూనె పూయడం వల్ల పొలుసులు ఇంకా ఎరుపు చర్మం పొడిబారడం తగ్గుతుంది.


ఈ నీలగిరి లేదా నీలగిరి తైలం ఆకులు యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలను ఈజీగా కలిగి ఉంటాయి.ఇక శతాబ్దాలుగా, నీలగిరి తైలం ఆకులను సాంప్రదాయ వైద్యంలో గాయాలు నయం చేయడానికి కీటకాలు కాటు, పగిలిన పాదాలు, పొడి చర్మం, కీటకాలు కాటు ఇంకా అలాగే జలుబు పుళ్ళు వంటి వివిధ రకాల చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.ఈ నీలగిరి నూనె తేమ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇంకా చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. నోటి నుండి హానికరమైన బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది.ఈ నీలగిరి తైలం సారం మౌత్ వాష్‌లు టూత్‌పేస్ట్‌లను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.ఇక తీవ్రమైన జలుబు పడిశం వంటివి పట్టినప్పుడు నీలగిరి తైలంని మరగబెట్టిన నీళ్లలో వేసి ఆవిరి పట్టిస్తే క్షణాల్లో జలుబు తగ్గుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇంకా అంతేకాదు చర్మవ్యాధుల నివారణలో కూడా నీలగిరి తైలం చాలా బాగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: