ఈ బిజీ లైఫ్ లో అసలు ఎం తింటున్నామో ఎలాంటి తిండి తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండా కడుపునిండితే చాలు అనుకోని తమ పనుల్లో బిజీ అయిపోతున్నారు చాలామంది.అయితే సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల ఇలా చేయవలసి వస్తుంది.మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ లో దోస, ఇడ్లీ ని ఎక్కువగా తీసుకుంటాం,కొందరి ఇళ్లలో అయితే ఇవి లేకుండ బ్రేక్ఫాస్ట్ నడవదు.అయితే మధ్యతరతి నుండి పెద్ద పెద్ద వాళ్ళ వరకు ఇడ్లీ ,దోస ఎక్కువగా తింటూ ఉంటారు.వీటిని చేసుకోవడం ఎక్కువ సమయం కూడా పట్టదు అది కాక ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు సమయానికి వెంటనే ఫ్రిజ్ లో అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశంతో వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు.కానీ అక్కడే మనం రోగాలు కొని తెచ్చుకుంటున్నాం.ఇడ్లీ పిండికాని దోస పిండి కానీ రెండు మూడు రోజులకన్నా ఎక్కవ రోజులు నిల్వ ఉంచి వాడుతున్నారా అయితే ఇలా చేయటం అసలు మంచిది కాదని ఆరోగ్యానికి ఎక్కువ నష్టం తెచ్చిపెడుతుంది అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు.మరి ఆ నష్టాలు ఏంటో అవి మన ఆరోగ్యాన్ని ఎలా పాడుచేస్తాయో తెలుసుకుంటే,ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.మరి అవేంటో చూద్దాం.


ఇలా నిల్వ ఉంచిన పిండితో ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు బారిన పడతారు.సరిగా అరుగుదల లేకపోవడం,మలబద్ధకం,విపరీతమైన క్రొవ్వు మన శరీరంలో పేరుకుపోతుంది.బరువు విపారీతంగా పెరిగిపోతారు.చిన్నపిల్లలో అయితే పులిసిన పిండితో ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ల పెరుగుదలలో సమస్యలు ప్రారంభమవుతాయి.ఇవే కూరలు,పప్పులు,చారులు,పదే పదే వేడి చేసి తినడం అంత మంచిది కాదు అని నిపుణులు చెప్తున్నారు.ఇలా చేయడం వల్ల వీటిలో ఉండే గూడ్ క్వాలిటీస్ నశిస్తాయి.ఇలాంటి ఆహారాన్ని తీసుకున్న మనకు ఉపయోగం ఉండదు.ప్రతిరోజు స్వచ్ఛమైన తాజా కూరగాయలతో ఆరోగ్యమైన తిండి ఎంతో అవసరం. మనం ఎంత కష్టపడినా మన ఆరోగ్యం సరిగా లేకపోతే ఎంత సంపాదించి ఎం లాభం.అందుకే మీరు చేసే పనికే కాదు, కొంచెం సమయం మీకు కూడ కేటాయించండి.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: