మన చుట్టూ పరిసరాలలో దొరికేటువంటి పండ్లలో జామ పండు కూడా ఒకటి. జామ పండ్లు తోనే కాకుండా జామ ఆకుల వల్ల కూడా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అలాగే ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, విటమిన్స్, క్యాల్షియం, మెగ్నీషియం ,ఫినాలేక్ సమ్మేళనాలు వంటివి కలిగి ఉండడమే కాకుండా విటమిన్లు, ఖనిజాలు వంటివి పుష్కలంగా లభిస్తాయి.. జామ ఆకులను నీటిలో మరిగించి తాగడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. అలాగే లేత ఆకులను కూడా నమలడం వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం.


ఉదయం పూట లేవగానే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాళ్ కూడా తగ్గిపోతాయి.


జామ ఆకుతో చేసేటువంటి డికాషన్ తాగడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గిపోతుంది.ముఖ్యంగా రక్తంలో ఉండేటువంటి ఎర్ర రక్త కణాలను సైతం పెంచేలా సహాయపడుతుంది.


శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల తరచూ నోటిలో నాలుక పైన పుండ్లు లేదా బొబ్బలు వంటివి వస్తూ ఉంటాయి. జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల వీటి నుంచి ఉపశమనాన్ని అందుకోవచ్చు.జామకాయలు జామ ఆకులు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. జామ ఆకులను కానీ.. రసాన్ని తాగడం వల్ల హానికరమైన పదార్థాలను కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ముఖం పైన ఉండేటువంటి మొటిమలు మచ్చలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు బరువు తగ్గాలనుకునే వారికి ఈ జామ ఆకులు చాలా ఉపయోగపడతాయి. శరీరంలో ఉండే కొవ్వును కరిగించి శరీరంలో ఉండేటువంటి టాక్సీను కూడా తొలగిస్తుంది దీనివల్ల శరీరం ఫిటుగా మారుతుంది.


మధుమేహ గ్రహస్తులకు జామ ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫినాలేక్ కంటెంట్ రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది దీనివల్ల మధుమేహం కూడా అదుపులో ఉంచేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: