
గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు. ముఖ్యంగా పచ్చి బొప్పాయి జోలికి అస్సలు పోకూడదు. పచ్చి బొప్పాయిలో లాటెక్స్ అనే పదార్థం ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచాలను కలిగించి, గర్భస్రావం లేదా ముందస్తు ప్రసవం ప్రమాదం పెంచుతుంది.
అలాగే మధుమేహం ఉన్నవారు బొప్పాయిని ఎవైడ్ చేయడమే బెటర్. బొప్పాయి తీయగా ఉంటుంది, సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు మితంగా మాత్రమే తినాలి. ఒకవేళ ఆల్రెడీ మీరు హై షుగర్ లెవల్స్ తో బాధపడుతుంటే బొప్పాయి తినకపోవడమే ఉత్తమం.
ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోవాలని భావిస్తున్నవారు బొప్పాయి తినడకూడదు. బొప్పాయిలో రక్తం పలుచబెట్టే గుణాలు ఉంటాయి. అందువల్ల సర్జరీకి ఒకటి లేదా రెండు వారాల ముందు నుంచి బొప్పాయి తినడం మానేయాలి.
కొంతమందికి బొప్పాయి అలెర్జీ ఉండవచ్చు. బొప్పాయి తిన్న తర్వాత కొందరికి చర్మంపై మంట, దురద, శ్వాసకోస సమస్యలు వస్తే వెంటనే మానేయాలి. జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు బొప్పాయి తినకుండా ఉండటమే బెటర్. ఎందుకుంటే బొప్పాయి ఆయా జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు. ఇక గుండె జబ్బులు ఉన్నవారు కూడా బొప్పాయి తినేముందు వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు