
ముఖ్య సంఘటనలు
1903: రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.
ప్రముఖుల జననాలు..
1778: సర్ హంఫ్రీ డేవీ, రసాయన శాస్త్రవేత్త. (మ.1829)సర్ హంఫ్రీడేవి 1778 డిసెంబరు 17న కార్నవాల్‌లోని పెంజన్స్ (ఇంగ్లండ్) లో రాబర్ట్ డేవి, గ్రేస్ మిల్లెట్ దంపతులకు జన్మించాడు. 1799 లో బ్రిస్టన్ లోని న్యూమాటిక్ ఇన్‌స్టిట్యూట్ లో సహాయకుడుగా పనిచేస్తూనే నైట్రస్ ఆక్సైడ్ యొక్క లక్షణాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కనుగొన్నాడు. దీంతో ఆయన్ను 23 సంవత్సరాల వయసులోనే గ్రేట్ బ్రిటన్ లోని రాయల్ ఇన్‌స్టిట్యూషన్ వారు రసాయన శాస్త్ర ఆచార్యులుగా నియమించుకున్నారు.
1866: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940)
1959: జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత.
ప్రముఖుల మరణాలు
1273: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ
1959: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (జ.1880)
1965: జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. (జ.1906)
1996: సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (జ.1924)
పండుగలు , జాతీయ దినాలు
పెన్షనర్స్ డే.
1956 : దుర్ముఖి - దత్తాత్రేయ జయంతి