ప్రస్తుత కాలంలో మనిషి ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకూ కూడా ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక పక్క ఇంటి బాధ్యత, మరో పక్క ఉద్యోగ భాద్యత ఇలా రెండు విషయాలని బ్యాలెన్స్ చేస్తూ తనలో తానూ మానసిక సంఘర్షణకి లోనవుతూ ఎంతో ఒత్తిడికి గురవుతున్నాడు. దాంతో లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటూ షుగర్, బీపీ, మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే

Image result for small trees reduce stress

ఇలాంటి ఒత్తిడి నుంచీ మనల్ని దూరం చేయడానికి కొన్ని రకాల మొక్కలు ఎంతో ఉపయోగపడుతాయట. జపాన్ లోని హోగ్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎవరైతే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారో వారు చిన్న చిన్న మొక్కలని పెంచాలని అంటున్నారు. మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి ఈ మొక్కలు ఎంతో చక్కగా ఉపయోగపడుతాయట.

Related image

చిన్న చిన్న మొక్కలని కుండీలలో పెట్టుకుని ఎంతో మంది టేబుల్ మీద, లేదా పనిచేసే ప్రాంతంలో కనిపించే విధంగా ఏర్పాటు చేసుకుంటే వాటి వల్ల ఒత్తిడి దూరమవ్వడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా మయమవుతాయట. ఇది నిరూపించడానికి ఇది నిరూపించడానికి 63 మంది ఉద్యోగులపై అధ్యయనం చేసింది సదరు యూనివర్సిటీ. అలసట వచ్చి ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఉద్యోగులు మొక్కలు ఉన్న చోట కూర్చోవాలని కొంతమందిని, కూర్చోకుండా పని చేయమని కొందమందికి సూచనలు చేసిందట. ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత వారిలో మానసిక పరిస్థితులని పరీక్షించగా మొక్కలని చూస్తూ పనిచేసిన వారు ఒత్తిడికి దూరంగా ఉండటమే కాకుండా ఎంతో ఉల్లాసంగా ఉన్నట్లు గుర్తించారట.



 

మరింత సమాచారం తెలుసుకోండి: