సాధారణంగా భోజనం చేసేటప్పుడు నీరు తాగడం చాలామందికి అలవాటు ఉంటుంది. వాస్తవానికి నీరు ఎప్పుడు తాగినా సరే మంచిదేనని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే భోజనానికి ముందుగా గానీ, భోజనం చేసేటప్పుడు గానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉన్నారు.. నిజానికి చాలామందిలో తినేటప్పుడు నీరు తాగవచ్చా? లేదా? అనేది ఒక పెద్ద సందేహంగా మారిపోయింది అత్యవసరమైనప్పుడు ముద్ద గొంతులో దిగినప్పుడు నీరు తాగుతాం.. కానీ జనరల్ గా తినేటప్పుడు నీరు తాగకూడదు.. అని తిన్న తర్వాత తాగాలని చాలామంది చెబుతూ ఉంటారు.

ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. అయితే చాలామంది ఆహారం తినే సమయంలో కానీ లేదా తిన్న తర్వాత కానీ నీరు తాగడం మంచిది కాదని చెబుతున్నారు.  అది జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుంది అనే భావన కూడా చాలామందిలో ఉంటుంది.  కానీ ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారంటే భోజనం చేయడానికి ముందు భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగడానికి కనీసం అరగంట వ్యవధి ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు.  అసలు తినేటప్పుడు నీరు తాగవచ్చో లేదో ఇప్పుడు చూద్దాం.

భోజనం చేసేటప్పుడు నీరు తాగవచ్చు.. భోజనానికి ముందు కానీ .. భోజనం చేసేటప్పుడు కానీ..  లేదా భోజనం తర్వాత కానీ నీరు తాగితే జీర్ణ ఎంజైములను పలచన చేస్తుంది.  తద్వారా జీర్ణక్రియ నెమ్మదవుతుంది అనే అభిప్రాయానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని.. పోషకాహార నిపుణులు చెబుతున్నారు.  ముఖ్యంగా భోజనం సమయంలో నీరు తాగడాన్ని నివారించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలోనే చాలా నీరు ఉంటుంది. భారతీయులు సూపులు,  రసాలు వంటి పలుచని ఆహారం తింటారు. వాటిలో కూడా నీరు ఉంటుంది.  అలాగే మజ్జిగలో కూడా నీరే ఉంటుంది.  అంతేకాదు మనం ఆహారాన్ని నమలడం ద్వారా.. లాలాజలం  ఉత్పత్తి అవుతుంది..అందులో  కూడా నీరే ఉంది కదా కాబట్టి తినేటప్పుడు నీరు తాగితే ఎటువంటి ప్రమాదం ఉండదు అని స్పష్టన అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: