లంగ్స్ ని క్లీన్ చేసి మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగిన మోతాదులో ఉండేలా చేయడంలో ఇప్పుడు చెప్పబోయే టిప్ చాలా చక్కగా పని చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే ఈ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి..ఇంకా అలాగే ఈ టిప్ ని ఎలా వాడాలి? వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ముల్లేటి పొడిని వేయాలి. తరువాత ఈ నీటిని ఒక గ్లాస్ అయ్యే దాకా బాగా మరిగించాలి.ఇక ఆ నీళ్లు బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడకట్టుకోవాలి. తరువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ అల్లం రసం ఇంకా ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి.ఈ డ్రింక్ ని తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఈజీగా తగ్గుతాయి.


శరీరంలో మలినాలు కూడా తొలగిపోతాయి.ఇంకా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిని తీసుకున్న మొదటి రోజే మనం మన శరీరంలో వచ్చిన మార్పును ఖచ్చితంగా గమనించవచ్చు. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం దీనిని అస్సలు తీసుకోకూడదు. ఈ డ్రింక్ ని తాగుతూనే ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవడానికి గానూ ప్రాణాయామం ఇంకా యోగా వంటివి చేయాలి. అలాగే బస్త్రికా ప్రాణాయామాన్ని రోజూ 15 నుండి 20 నిమిషాల పాటు ఖచ్చితంగా చేయాలి. ఈ టిప్ ని పాటించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆవిరి పట్టాలి. ఎందుకంటే ఆవిరి పట్టడం వల్ల శ్వాస మార్గంలో ఉండే అడ్డంకులు అన్ని చాలా ఈజీగా తొలగిపోతాయి. ఇందుకోసం మీరు ఒక గిన్నెలో నీటిని తీసుకుని వాటిని వేడి చేయాలి.అలాగే ఇందులో వాము, కొద్దిగా పసుపు వేసి ఈ నీటిని బాగా మరిగించాలి. తరువాత ముఖం మీద దుప్పటిని వేసుకుని ఈ నీటితో ఆవిరి పట్టాలి. ఇలా ఈ టిప్ ని పాటించడం వల్ల చాలా సులభంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: