సాధార‌ణంగా చాల మంది చెప్పులు వేసుకోకుండా బ‌య‌ట‌కు వెళ్ల‌రు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు కూడా పాదరక్షల్ని వదల‌ని వారూ ఉంటారు. ఉదయం బెడ్ మీదున్నుండి దిగింది మొదలు, మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు.  టైమ్‌, ప్లేస్‌ను బట్టి ఏదో ఓ పాదరక్షకాలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం. ఇది ఏమాత్రం ఒంటికి మంచిది కాదని చాలా మందికి తెలియదు. అయితే చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఇలా నడవడం వల్ల భూమికి దగ్గరగా నడిచిన అనుభూతి కలుగుతుంది. ఎంతో సంతోషం కూడా కలుగుతుంది. పాదాలు అలసట కోల్పోతాయి. చెప్పులు లేకుండా ఉత్త పాదాలతో నడిస్తే కాళ్లకు గాయాలు కావట. నడక స్థిరంగా ఉంటుందట. శరీర భంగిమ కూడా కరక్ట్‌గా ఉంటుందిట. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి , జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.


అదే విధంగా నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా , ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా కుచ్చుకోవడం ద్వారా, మీ బిపి కంట్రోల్ అవుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పాదాలు, కాళ్లు , కండరాలు దృఢంగా పనిచేయాలంటే చెప్పుల్లేకుండా నడవాలి. ఇలా చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ప్రతిరోజూ కాకపోయినా కనీసం వారానికి ఒకసారి అయినా చెప్పులేకుండా కిలోమీటర్ నడ‌వ‌మంటున్నారు నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: