ఆధునిక కాలంలో కపుల్స్ చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. వివాహం చేసుకోగానే తదుపరి కార్యక్రమాల గురించి కూడా ముందుగానే ప్లాన్లు చేసుకుంటున్నారు. అయితే చాలా మంది జంటలకు హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లాలి ? ఎన్ని రోజులు ఉండాలి ? ఎలాంటి బట్టలు వేసుకోవాలి ? అనే విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది జంటలు వివాహం తర్వాత హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం గురించి గందరగోళంలో ఉంటారు. హనీమూన్ చిరస్మరణీయంగా గుర్తుండి పోవడానికి ఎక్కడికి వెళ్లాలి? ముఖ్యంగా కరోనా కాలంలో రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలి. ఒకవేళ మీరు సెప్టెంబర్ నెలలో హనీమూన్‌కి వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా భారతదేశంలోని ఈ ప్రదేశాలను సందర్శించండి.

కాశ్మీర్
కాశ్మీర్‌ను భూతల స్వర్గం అంటారు. సహజ సౌందర్యానికి కాశ్మీర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మీరు హనీమూన్ జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలనుకుంటే కచ్చితంగా కశ్మీర్‌కు వెళ్లండి. కాశ్మీర్‌లో అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి దాల్ సరస్సు. మీరు ఇక్కడ బోటింగ్ ఎంజాయ్ చేస్తూ ప్రకృతితో గడపవచ్చు.

అలెప్పీ, కేరళ
కేరళ ప్రీ వెడ్డింగ్ షూట్స్, రొమాంటిక్ వెకేషన్స్, వెడ్డింగ్ డెస్టినేషన్స్, హనీమూన్ లకు ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో జంటలు కేరళను సందర్శిస్తారు. కేరళ సహజ ప్రాకృతిక అందాలకు ప్రసిద్ధి. ఈ దక్షిణ భారతదేశంలో చూడడానికి అనేక మతపరమైన, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అలెప్పీ. కపుల్స్ కు ఇది చాలా ప్రత్యేకమైన స్థలం. అలెప్పీని సందర్శించి మీ హనీమూన్‌ను గుర్తుండిపోయేలా చేసుకోండి.

ఊటీ, తమిళనాడు
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో ఉన్న ఊటీ పర్యాటకులను ఆకర్షించే స్థానం. పెద్ద సంఖ్యలో పర్యాటకులు, కపుల్స్ సెలవుల కోసం ఊటీకి వెళతారు. హనీమూన్ కోసం ఊటీకి కూడా వెళ్లవచ్చు. నీలగిరి జలపాతం, హొగేనక్కల్ జలపాతాలను ప్రజలు వర్షాకాలంలో ప్రత్యేకంగా సందర్శిస్తారు.

అండమాన్ అండ్ నికోబార్
అండమాన్ నికోబార్ హనీమూన్ కోసం సరైన గమ్యస్థానం. అండమాన్‌లో సూర్యాస్తమయం సమయం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఫోటోషూట్ల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు బీచ్‌లో ఉంటారు. బీచ్‌లో బోటింగ్, సర్ఫింగ్, ఫిషింగ్, స్కీయింగ్ మొదలైన వాటిని ఆస్వాదించవచ్చు. ఎవరైనా ఏ కాలంలోనైనా ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: